అమరావతి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన

తాజా వార్తలు

Published : 23/02/2020 23:37 IST

అమరావతి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన


అమరావతి: గుంటూరు జిల్లా లేమల్లెలో వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌ను అడ్డుకున్న మహిళా ఐకాస నేతలు, రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అమరావతి పీఎస్‌కు తరలిస్తున్నట్లు చెప్పి పెదకూరపాడు పీఎస్‌కు తీసుకెళ్లడంతో అక్కడ మహిళలు ఆందోళనకు దిగారు. అనంతరం మళ్లీ అమరావతి పీఎస్‌కు తరలించడంతో అక్కడా ఆందోళన కొనసాగించారు. పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. అమరావతి పీఎస్‌ వద్ద ‘జై అమరావతి’ నినాదాలతో హోరెత్తించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని