నిర్భయ దోషి పిటిషన్‌ కొట్టివేత

తాజా వార్తలు

Published : 16/03/2020 16:12 IST

నిర్భయ దోషి పిటిషన్‌ కొట్టివేత

దిల్లీ: నిర్భయ హత్యాచారం కేసులో దోషులకు మరికొన్ని రోజుల్లో శిక్ష అమలు కావాల్సి ఉంది. ఈ క్రమంలో దోషుల్లో ఒకరైన ముకేశ్‌సింగ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. క్యురేటివ్‌, మెర్సీ పిటిషన్లను పునరుద్ధరించాలని కోరాడు. సోమవారం ఆ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించింది. ముకేశ్‌ చేసిన అభ్యర్థనను కొట్టివేసింది. ఈ పిటిషన్‌ పరిశీలించదగింది కాదని సుప్రీం పేర్కొంది. కాగా.. ఈ కేసులో దోషులకు శిక్ష ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. తాజాగా ఈనెల 20న ఉదయం 5.30గంటలకు దోషులను ఉరితీయాలని పటియాలా కోర్టు డెత్‌వారెంట్లు జారీ చేసింది. దోషుల అభ్యర్థనలను రాష్ట్రపతితో పాటు సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది. దీంతో వాళ్లకు శిక్ష నుంచి తప్పించుకునే మార్గాలు మూసుకుపోయాయి. కేసులో ముకేశ్‌సింగ్‌తో పాటు దోషులుగా ఉన్న అక్షయ్‌, వినయ్‌శర్మ, పవన్‌గుప్తా ఉరికంబం ఎక్కనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని