లాక్‌డౌన్‌: డ్రోన్‌తో విశాఖ రైల్వేస్టేషన్‌ ఇలా!

తాజా వార్తలు

Published : 12/04/2020 19:41 IST

లాక్‌డౌన్‌: డ్రోన్‌తో విశాఖ రైల్వేస్టేషన్‌ ఇలా!

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తితో దేశంలో లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలవుతోంది. అన్ని రాష్ట్రాలూ లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశనం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలు కూడా వైరస్‌ వ్యాప్తి నివారణకు ఎక్కడికక్కడ చర్యలు చేపడుతున్నాయి. నిర్దేశించిన మినహా మిగతా సమయాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించాయి. గ్రామాల్లో సైతం ఇవి కఠినంగా అమలవుతున్నాయి. పోలీసు సిబ్బంది ఎక్కడికక్కడ పహారా కాస్తున్నారు.

ఏపీ పోలీసులు పలుచోట్ల డ్రోన్లతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తాజాగా విశాఖపట్నం, గుంటూరు జిల్లా తెనాలి, పశ్చిమగోదావరి జిల్లా తంగెళ్లమూడి కంటైన్‌మెంట్‌ జోన్‌ పరిధిలో డ్రోన్‌తో తీసిన దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. విశాఖ రైల్వేస్టేషన్‌ పరిసరాలు, తెనాలి పట్టణం, తంగెళ్లమూడి ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆయా ప్రాంతాల డ్రోన్‌ దృశ్యాలు మీకోసం.. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని