నా వయస్సు ఈ గమ్ బాటిల్‌ అంత!
close

తాజా వార్తలు

Published : 08/06/2021 00:09 IST

నా వయస్సు ఈ గమ్ బాటిల్‌ అంత!

వైరల్‌గా మారిన ఓ అమ్మాయి ట్వీట్‌

నీ వయసెంత అని ఎవరైనా అడిగితే అంకెను సూచించి చెబుతాం.. లేదా ఫలానా ఏడాదిలో పుట్టానని చెబుతాం. కానీ ఇక్కడో అమ్మాయి ‘నా వయసు ఈ గమ్‌బాటిల్‌ అంత’ అని చెప్పడం.. ఆమాటతో పాటు ఆ గమ్‌బాటిల్‌ ఫొటోను జతచేసి పెట్టడం.. ఇదంతా ట్విటర్‌లో వైరల్‌గా మారింది. ఒక్కోసారి చిన్నవిషయాలే కావొచ్చు కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితాంతం మనకు ఆనందాన్ని ఇస్తాయి. ఇందుకు ఉదాహరణే ఈ గమ్‌బాటిల్ ట్వీట్‌. 1980,90లో పుట్టిన వారంతా ఈ పోస్టును చూసి తమ చిన్నతనాన్ని గుర్తుతెచ్చుకుంటున్నారు. అవును మరి! ఆ రోజుల్లో ఏదైనా అతికించాలంటే ఈ బాటిల్‌ ఉండాల్సిందే కదా! ప్రస్తుతం వీటి వినియోగం కాస్త తగ్గడంతో పాటు వాటి స్థానాల్లో  గ్లూన్‌గన్‌లూ వచ్చేసాయి. ఏదేమైనా ప్రియాంకా అనే అమ్మాయి చేసిన ఈ ట్విట్‌కి 80,90లో తమ బాల్యాన్ని మళ్లీ ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఈ ట్వీట్‌కు 13వేలకు పైగా లైక్స్‌రాగా.. వేలకు పైగా రీట్వీట్స్‌ అయ్యాయి. అంతేనా.. దీని చూడగానే నాకు గమ్‌ వాసన గుర్తొస్తుందని ఒకరు, చిన్నప్పుడు పోస్ట్‌ఆఫీసులో ఉండేది అని మరొకరు..  ఇలా ఒక్కసారిగా ట్విటర్‌ అంతా పాతజ్ఞాపకాల పొదరిల్లుగా మారిపోయింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని