Top Ten News @ 1 PM

తాజా వార్తలు

Updated : 09/06/2021 14:32 IST

Top Ten News @ 1 PM

1. TS News: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు రద్దు

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు రద్దయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ద్వితీయ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసింది. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలపై మంగళవారం కేబినెట్‌ భేటీలో చర్చ జరిగింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈతో పాటు మరికొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయని అధికారులు కేబినెట్‌ దృష్టికి తీసుకెళ్లారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Vaccine: టీకా ధ్రువపత్రంలో తప్పులా?

కరోనా టీకా ధ్రువపత్రంలో పేరు, పుట్టినతేదీ వంటి వివరాల్లో తప్పులొచ్చాయా? అయినా కంగారుపడాల్సిన అవసరం లేదు. కొవిన్‌ వెబ్‌సైట్‌ ద్వారా వాటిని సరిచేసుకునే వీలు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. కొవిడ్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌లో మార్పులు చేసుకునేలా వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసినట్లు బుధవారం వెల్లడించింది. ‘‘కొవిన్‌ నమోదు సమయంలో పేరు, పుట్టినతేదీ, లింగం వంటి వివరాలను పొరబాటుగా తప్పుగా ఇస్తే టీకా ధ్రువపత్రంలో వాటిని సరిచేసుకోవచ్చు’ అని ఆరోగ్యసేతు ట్విటర్‌ ఖాతాలో కేంద్రం ట్వీట్ చేసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వ్యాక్సినేషన్‌ అయ్యే వరకూ నిబంధనలు

3. Choksi: ఛోక్సీ విమాన టికెట్లు ఇవ్వజూపాడు

పరారీలో ఉన్న భారత నగల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ తన కోసం చాలాసార్లు హోటల్‌ గదులను బుక్‌ చేసేందుకు ముందుకొచ్చాడని.. ఆయన ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న బార్బరా జబరికా చెప్పారు. విమాన ప్రయాణ టికెట్లనూ ఇవ్వజూపాడని తెలిపారు. తాను మాత్రం తమ మధ్య కేవలం స్నేహాన్నే కోరుకున్నానని స్పష్టం చేశారు. జబరికా తనను వలలో ఇరికించి, కిడ్నాప్‌నకు సహకరించిందంటూ ఛోక్సీ తాజాగా చేసిన ఆరోపణలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో ఆమె స్పందించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 400 మంది మరణించారు.. టీకాలివ్వండి

కరోనా మహమ్మారి నుంచి రక్షణ కల్పించే టీకాను తమ సిబ్బందికి అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌ ఇండియా ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. ఈ వైరస్ ఇప్పటికే తమ సంస్థలోని దాదాపు 400 మంది సిబ్బంది ప్రాణాలను హరించిందని ఆవేదన వ్యక్తం చేసింది.  ప్రపంచంలోనే అగ్రశ్రేణి బొగ్గు ఉత్పత్తి సంస్థ కోల్‌ ఇండియాలో సుమారు 2,59,000 మంది ఉపాధి పొందుతున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. CBN: హిడెన్‌ స్ప్రౌట్స్ కూల్చివేత హేయం: చంద్ర‌బాబు

విశాఖ న‌గ‌రంలో విభిన్న ప్ర‌తిభావంతుల‌కు లాభాపేక్ష లేకుండా నిస్వార్థ సేవ చేస్తున్న హిడెన్‌ స్ప్రౌట్స్‌ పాఠ‌శాల కూల్చివేత‌కు అనుమ‌తించ‌డం సిగ్గుచేటని తెదేపా అధినేత చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. ఈ మేర‌కు ఆయ‌న ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి(సీఎస్‌) ఆదిత్య‌నాథ్ దాస్‌కు లేఖ రాశారు. వైకాపా ప్ర‌భుత్వ కూల్చివేత చ‌ర్య‌ల్లో చోటు చేసుకున్న తాజా ఘ‌ట‌న అత్యంత హేయ‌మ‌ని మండిప‌డ్డారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Raghurama: గజేంద్రసింగ్‌తో రఘురామ భేటీ

6. TS News: మూడో ద‌శ ఎదుర్కొనేందుకు సిద్ధం: డీహెచ్‌

తెలంగాణ రాష్ట్రంలోని క‌రోనా ప‌రిస్థితుల‌పై ప్ర‌జారోగ్య సంచాల‌కులు(డీహెచ్‌) శ్రీ‌నివాస‌రావు, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రిజ్వి, డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి, పౌర స‌ర‌ఫ‌రాల క‌మిష‌న‌ర్‌ హైకోర్టుకు నివేదిక స‌మ‌ర్పించారు. గ‌త నెల‌ 29వ తేదీ నుంచి రోజుకు స‌రాస‌రి ల‌క్ష క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్న‌ట్లు డీహెచ్‌ వివ‌రించారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 66,79,098 వ్యాక్సిన్లు వేసిన‌ట్లు తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Trojan Shield: మాఫియాపై ఆపరేషన్‌ ట్రోజన్‌ షీల్డ్‌..!

ఆపరేషన్‌ ట్రోజన్‌ షీల్డ్‌ పేరుతో 16 దేశాల్లో ఏకకాలంలో నిర్వహించిన భారీ ఆపరేషన్‌ వ్యవస్థీకృత నేరగాళ్లకు చుక్కలు చూపించింది. వివిధ దేశాల నిఘా సంస్థలు, భద్రతా బృందాలు కలిసి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఫలితంగా  ప్రపంచ వ్యాప్తంగా 800 మంది నేరగాళ్లను అరెస్టు చేశారు. దాదాపు 150 హత్యలు జరగకుండా ముందే అడ్డుకొన్నారు. 250 మారుణాయుధాలు, 48 మిలియన్‌ డాలర్ల నగదును స్వాధీనం చేసుకొన్నారు. 8 టన్నుల కొకైన్‌, 2 టన్నుల గంజాయి, 6 టన్నుల సింథటిక్‌ డ్రగ్స్‌, 55 లగ్జరీ కార్లు సీజ్‌ చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Covaxin: డెల్టా, బీటా రకాలపై భేష్‌

భారత్‌లో రెండో దశ తీవ్ర ఉద్ధృతికి కారణంగా భావిస్తోన్న డెల్టా వేరియంట్ నుంచి దేశీయ ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా మెరుగైన రక్షణ కల్పిస్తోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. పుణెకు చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ), భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) సంయుక్తంగా ఇటీవల అధ్యయనం చేపట్టాయి. డెల్టాతో పాటు బీటా వేరియంట్‌నూ ఈ టీకా సమర్థంగా ఎదుర్కంటోందని అధ్యయనంలో తేలింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Corona: రెండో రోజూ లక్షకు దిగువనే కొత్తకేసులు

9. Alitho Saradaga: నా అన్నయ్య రాముడిలాంటోడు

ప్రేక్షకుల అభిమానానికి హద్దులు లేనట్లే.. తమ నటనా ప్రతిభకు హద్దులు లేవని నిరూపించుకున్నారు ఈ అపూర్వ సహోదరులు. బాలనటులుగా తెలుగు తెరపై అడుగుపెట్టారు. ఎన్నో సీరియల్స్‌, సినిమాల్లో నటించి బుల్లితెరతో పాటు వెండితెర ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న సోదరులు కౌశిక్‌, బాలాదిత్య ‘ఆలీతో సరాదా’లో పంచుకున్న విశేషాలు మీకోసం..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Cricket News: కేన్‌కు గాయం.. కివీస్‌కు బెంగ

 ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ! ఆ జట్టు సారథి కేఎన్‌ విలియమ్సన్‌ గాయపడ్డాడు. తొలి టెస్టులో ఎడమ మోచేతికి గాయమవ్వడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది. ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం మొదలయ్యే రెండో టెస్టులో అతడు ఆడతాడో లేడో స్పష్టత లేదు. బహుశా బుధవారం సాయంత్రం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కాగా ఎడమచేతి చూపుడు వేలిలో చీలిక రావడంతో స్పిన్నర్‌ మిచెల్‌ శాంట్నర్‌ ఇప్పటికే దూరమయ్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అప్పట్లో మనం ‘బ్లడీ ఇండియన్స్‌’ : ఫరూక్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని