Top 10 News @ 9 PM

తాజా వార్తలు

Updated : 29/04/2021 22:30 IST

Top 10 News @ 9 PM

1. ఎగ్జిట్‌ పోల్‌: ఐదు రాష్ట్రాల్లో గెలుపెవరిది..?

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమ బెంగాల్‌(294), తమిళనాడు(234), అస్సాం(126), కేరళ(140), పుదుచ్చేరి(30) రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం ప్రస్తుతం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యింది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వ్యాక్సిన్‌ ధర తగ్గించిన భారత్‌ బయోటెక్‌

కరోనా వ్యాక్సిన్‌ ధరను తగ్గిస్తూ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ సంస్థ తయారు చేస్తున్న కొవాగ్జిన్‌ను రూ.400లకే రాష్ట్ర ప్రభుత్వాలకు అందించనున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.600లకు కొవాగ్జిన్‌ అందిస్తామని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

1000 పడకలతో రిలయన్స్‌ కొవిడ్‌ ఆస్పత్రి

3. అది మా పొరపాటే : ఫేస్‌బుక్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలంటూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన ఓ హ్యాష్‌టాగ్‌ను తొలగించాలని భారత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఫేస్‌బుక్‌ స్పష్టం చేసింది. ఆ హ్యాష్‌టాగ్‌ను పొరపాటున తొలగించామని.. అనంతరం పునరుద్ధరించినట్లు వెల్లడించింది. అటు ఈ అంశంపై వచ్చిన వార్తలను కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీశాఖ కూడా ఖండించింది. సదరు హ్యాష్‌టాగ్‌ను తొలగించాలని భారత ప్రభుత్వం ఆదేశించినట్లు ఓ అంతర్జాతీయ వార్త సంస్థ ప్రచురించిన కథనం తప్పుదోవ పట్టించేదిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Corona: 5లక్షల ICU బెడ్లు.. లక్షన్నర డాక్టర్లు కావాలి 

 భారత్‌పై కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. నానాటికీ పెరుగుతున్న కేసుల కారణంగా ఆసుపత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. పడకలు దొరక్క.. వైద్యులు అందుబాటులో లేక వైరస్‌ బాధితులు అల్లాడిపోతున్నారు. అయితే రానున్న వారాల్లో ఈ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారే అవకాశముందని అంటున్నారు ప్రముఖ సర్జన్‌, నారాయణ హెల్త్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ దేవీ ప్రసాద్‌ శెట్టి. మహమ్మారి సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌కు అదనంగా మరో 5లక్షల ఐసీయూ పడకలు, 3.5లక్షల వైద్య సిబ్బంది అవసరమని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* home isolation: కొత్త మార్గదర్శకాలు ఇవే!

5. పరిమితికి మించి వసూలు చేస్తే చర్యలు: ఏపీ డీజీపీ

 రాష్ట్రంలో రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్, ఫీజుల పేరిట దోపిడీ తదితర అంశాలపై నిరంతర నిఘా ఉంచినట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డ్రగ్ కంట్రోల్, మెడికల్ అండ్ హెల్త్ శాఖల సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ ఆస్పత్రుల్లో దాడులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్ సిలెండర్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100, 1902కు ఫోన్ చేయాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కొవిడ్‌కు వ్యాక్సినేషనే పరిష్కారం: జగన్‌

కొవిడ్‌కు వ్యాక్సినేషన్‌ మాత్రమే పరిష్కారమని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి  సామర్థ్యం నెలకు ఏడు కోట్లు మాత్రమేనని.. 45 ఏళ్లకు పైబడిన వారు దేశవ్యాప్తంగా 26 కోట్ల మంది ఉన్నారన్నారు. వీరికి నాలుగు వారాల వ్యవధిలో రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు మొత్తం 52 కోట్ల వ్యాక్సిన్లు కావాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏపీలో 14,792 కేసులు.. 57 మరణాలు

7. TS: 10రోజుల్లోగా 3,010 కొత్త ఐసీయూ పడకలు

రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్స పొందుతున్న బాధితులను ప్రతి రెండు గంటలకు ఒకసారి పర్యవేక్షించాలని.. బాధితుల కుటుంబసభ్యులకు సమాచారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో పరిశుభ్రత ఉండేలా చూడాలని, ఆక్సిజన్ కనీసం 24 గంటల ముందస్తుగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 3,010 కొత్త ఐసీయూ పడకలను పది రోజుల్లోగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక: ఎగ్జిట్‌పోల్స్‌

అధికార పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఖాళీ అయిన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో తెరాస 50.48శాతం ఓట్లు దక్కించుకుందని ఆరా సంస్థ అంచనా వేసింది. శుక్రవారంతో ఐదు రాష్ట్రాలు, పలు చోట్ల శాసనసభ, లోక్‌సభ స్థానాలకూ  ఎన్నికలు/ఉప ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌పోల్స్‌ వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో అధికార తెరాస 50.48శాతం ఓట్లు సాధించినట్లు ఆరా సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తిరుపతి ఉపఎన్నిక.. గెలిచేదెవరో: ఎగ్జిట్‌పోల్‌

9. ధోనీ లోటును కేన్‌ మాత్రమే పూడ్చగలడు: ఓజా

చెన్నై సూపర్‌ కింగ్స్‌ అనగానే చాలామందికి వెంటనే గుర్తుకు వచ్చేది ధోనీనే. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై ఎదగడంలో సారథి ధోనీ పాత్ర కీలకం. అయితే.. ఇప్పటికే ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రం చెన్నైని నడిపిస్తున్నాడు. మరి లీగ్‌లో చెన్నైలాంటి ప్రతిభావంతమైన జట్టును ధోనీ స్థాయిలో నడిపించాలంటే ఎవరి వల్ల సాధ్యం. ఈ విషయంలో భారత మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా ఒక సూచన చేశాడు. చెన్నై కెప్టెన్‌గా ధోనీ స్థానాన్ని కేన్‌ విలియమ్సన్‌ మాత్రమే భర్తీ చేయగలడన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భాజపా వాళ్లు నా నంబర్‌ లీక్‌ చేశారు: సిద్దార్థ్‌

తమిళనాడుకు చెందిన భాజపా నేతలు తన ఫోన్‌ నంబర్‌ని లీక్‌ చేశారని ప్రముఖ నటుడు సిద్దార్థ్‌ ఆరోపణలు చేశారు. టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న సిద్దార్థ్‌ గత కొన్నిరోజులుగా కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు భాజపా కార్యకర్తలతో ఆయనకు ఆన్‌లైన్‌లో మాటల యుద్ధం జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నమ్రత విన్నపం.. అనుపమ ఆనందం

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని