Top Ten News @ 9 PM

తాజా వార్తలు

Published : 20/07/2021 20:57 IST

Top Ten News @ 9 PM

1. కోకాపేట భూముల వేలంపై ఆరోపణలు నిరాధారం

కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ భూముల వేలంపై ఆరోపణలు నిరాధారమని స్పష్టంచేసింది. ఈ మేరకు ఆరు పేజీలతో కూడిన వివరణతో ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘‘భూముల వేలం పారదర్శకంగా జరిగింది. వేలంలో పాల్గొనకుండా ఎవరినీ నియంత్రించలేదు’’ అని ప్రభుత్వం పేర్కొంది.

Singareni: పదవీ విరమణ వయసు పెంపు

Ts News: భూముల విలువ పెంచుతూ ఉత్తర్వులు

2. ఏపీలో అలాంటి ప్యాకేజీ లేదు: కనకమేడల

కరోనా, కొవిడ్‌ బాధిత కుటుంబాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో ఆరోపించారు. తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనలో మరణాలు తక్కువ చేసి చూపించి రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేసిందన్నారు. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరతతో ఒక్కరోజే 31 మంది చనిపోతే.. కేవలం 11 మంది మాత్రమే మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు పేర్కొన్నారు.

3. వారి నినాదం ‘ఇద్దరు పిల్లలు’.. కానీ వారికేమో..

జనాభా నియంత్రణ చర్యల్లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధనను తీసుకురానుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు పిల్లల నినాదం మధ్యప్రదేశ్‌లోనూ ఊపందుకుంది. తమ రాష్ట్రంలోనూ ఈ నిబంధన తీసుకురావాలని చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే మధ్యప్రదేశ్‌లోని 80 కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలకు ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండటం గమనార్హం.

4. కొవిడ్‌ మరణాల తగ్గింపు ఆరోపణలపై కేంద్రం కౌంటర్‌

దేశంలో కరోనా కేసులు, మరణాలను తగ్గించి చూపిస్తున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ స్పందించారు. కొవిడ్‌ మరణాల రిజిస్ట్రేషన్‌ను రాష్ట్రాలే చేస్తున్నాయన్నారు. మరణాలు, కేసులను తక్కువగా నమోదు చేయాలని ఏనాడూ రాష్ట్రాలకు చెప్పలేదని స్పష్టంచేశారు. గత రెండు దశల అనుభవాలను బట్టి చూస్తే కరోనా థర్డ్‌ వేవ్‌ చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుందనడం సరికాదన్నారు.

పార్లమెంట్‌లో ఈరోజు.. కేంద్రం సమాధానాలివే..!

5. TS News: సినిమా థియేటర్లకు ఊరట

కరోనా వైరస్ కారణంగా మూతపడిన సినిమా థియేటర్లకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కల్పించింది. థియేటర్లకు ఆర్థికంగా వెసులుబాటు కలిగేలా పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద యాజమాన్యం సినిమాకు వచ్చే ప్రేక్షకుల నుంచి వాహనాల పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.

6. Blue Origin: రోదసిలోకి వెళ్లి వచ్చిన అమెజాన్‌ అధినేత

అంతరిక్షయానంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌తో పాటు మరో ముగ్గురితో కూడిన ‘న్యూ షెపర్డ్‌’ ప్రయోగం విజయవంతమైంది. నలుగురు ప్రయాణికులతో కూడిన న్యూ షెపర్డ్‌ అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమిని చేరుకుంది. రోదసి పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా అమెజాన్‌ అధినేత స్వీయ సంస్థ ‘బ్లూ ఆరిజిన్‌’ ఈ యాత్రను చేపట్టింది.

7. China: భారత్‌పై చైనా కొత్త కుట్రలు

భారత్‌తో లద్దాఖ్‌లో ప్రతిష్ఠంభన అనంతరం చైనా కొత్త కుయుక్తులు పన్నుతోంది. హిమాలయ శ్రేణుల్లో తనకున్న పోరాట పరిమితులను అధిగమించేందుకు కొత్త వైమానిక స్థావరాన్ని నిర్మిస్తోంది. ఇప్పటివరకు ఖష్గర్, హోగాన్ స్థావరాల నుంచే పోరాట కసరత్తులు చేసిన చైనా.. తాజాగా షాక్సేలో మరో స్థావరాన్ని వేగంగా నిర్మిస్తోంది. తద్వారా భారత్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు డ్రాగన్ ప్రణాళికలు రచిస్తోందని సైనిక వర్గాలు తెలిపాయి.

8. I T portal: ఐటీ పోర్టల్‌లో లోపాలు..! 

ఆదాయపు పన్ను శాఖ వెబ్‌పోర్టల్‌లో లోపాలు ఉన్నట్లు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ గుర్తించిందని.. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరీ పార్లమెంట్‌కు తెలిపారు. నిదానంగా పనిచేయడం, చాలా సందర్భాల్లో కొన్ని రకాల సేవలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లు చెప్పారు. www.incometax.gov.in వెబ్‌పోర్టల్‌ను ప్రభుత్వం జూన్‌ 7వ తేదీ ప్రారంభించింది.

9. నా ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది: నటి ఖుష్బూ

నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ట్విటర్‌ ఖాతా మరోసారి హ్యాకింగ్‌కు గురైంది. ఇదే విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. ట్విటర్‌లోని కవర్‌ ఇమేజ్‌తో పాటు ఖుష్బూ సుందర్‌గా ఉన్న ఆమె ఖాతా పేరును కాస్త ‘బ్రియాన్‌’గా హ్యాకర్లు మార్చేశారన్నారు. గతంలో ఆమె చేసిన ట్వీట్లు, పోస్టులను డిలీట్‌ చేశారన్నారు.

10. INDvsSL: టీమ్‌ఇండియా లక్ష్యం 276

కొలంబోలో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక.. టీమ్‌ఇండియా ముందు 276 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండో (50; 71 బంతుల్లో 4x4, 1x6), మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ చారిత్‌ అసలంక (65; 68 బంతుల్లో 6x4) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నె(44 నాటౌట్‌; 33 బంతుల్లో 5x4) మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దాంతో ఆతిథ్య జట్టు మరోసారి టీమ్‌ఇండియా ముందు మంచి స్కోరే లక్ష్యంగా నిర్దేశించింది.

INDvsSL: లైవ్‌బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని