Top Ten News @ 1 PM
close

తాజా వార్తలు

Published : 22/07/2021 12:56 IST

Top Ten News @ 1 PM

1. Ap News: వైఎస్సార్‌ కాపు నేస్తం నిధుల విడుదల

రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం రెండో ఏడాది నిధులు విడుదల చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్‌ మీట నొక్కి 3.27లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో రూ.490.86 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థికసాయం చేయనున్నట్లు వివరించారు.

ఏలూరు ఓట్ల లెక్కింపు తేదీ వెల్లడించిన ఎస్‌ఈసీ

2. AP News: ప్రతి గింజకూ డబ్బు చెల్లించాలి: పవన్‌ 

ఏపీలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, లెక్కలను ప్రభుత్వం గోప్యంగా ఎందుకు ఉంచుతోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటనలో విడుదల చేశారు. రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ నెలాఖరులోగా ప్రతి గింజకూ డబ్బు చెల్లించాలని.. లేనిపక్షంలో రైతుల కోసం పోరాడతామని హెచ్చరించారు.

3. యాదాద్రిలో విరిగిపడిన కొండచరియలు
దాద్రి రెండో ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కొండపై నుంచి బండరాళ్లు కిందపడ్డాయి. దీంతో కొండపైకి చేరుకునే ఘాట్‌ రోడ్డులో రాకపోకలు నిలిపేశారు.మొదటి ఘాట్‌ రోడ్డు ద్వారా భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

4. 100 మందికి ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’: కేటీఆర్‌

తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్ర వాహనాలను అందిస్తున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. గతేడాది గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా తాను 6 అంబులెన్స్‌లను విరాళంగా ఇవ్వగా.. తెరాస ప్రజాప్రతినిధులు, నేతలు 90 ఇచ్చారని గుర్తు చేశారు. ఈనెల 24న తన జన్మదినం సందర్భంగా అవసరం ఉన్న వారిని వ్యక్తిగతంగా సాయం అందించాలని, ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటాలని తెరాస నేతలు, అనుచరులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

5. లోక్‌సభలో వైకాపా ఎంపీల ఆందోళన
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై లోక్‌సభలో వైకాపా ఎంపీలు ఆందోళనకు దిగారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల విషయంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రశ్నోత్తరాల సమయంలో వైకాపాకు చెందిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి గెజిట్‌ నోటిఫికేషన్‌పై ప్రశ్న లేవనెత్తారు. దీనిపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ సమాధానమిచ్చారు. 

6. Corona: మరోసారి 40వేలపైనే కొత్తకేసులు 

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉంటుండం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17.18లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా.. 41,383 మందికి పాజిటివ్‌గా తేలింది. కేరళ, మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.12కోట్లకు చేరింది. 

7. Farmers: దిల్లీలో మళ్లీ కదం తొక్కిన రైతన్నలు

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత కొద్ది నెలలుగా దేశ రాజధాని సరిహద్దుల్లో ప్రశాంతంగా ఆందోళన సాగిస్తున్న రైతన్నలు నేడు మరోసారి కదం తొక్కారు. దిల్లీ నడిబొడ్డున ఉన్న జంతర్‌మంతర్‌ వద్ద నేటి నుంచి ఆందోళన చేపట్టనున్నారు. ‘కిసాన్‌ సంసద్‌(రైతుల పార్లమెంట్‌)’ పేరుతో నిర్వహించే ఈ నిరసన కార్యక్రమానికి సరిహద్దుల నుంచి అన్నదాతలు బస్సుల్లో ర్యాలీగా వెళ్లనున్నారు. 

8. pak: గిల్లి మరీ తిట్టించుకున్న పాక్‌..!

పాక్‌ ప్రభుత్వం తాలిబన్‌ ఉగ్ర మూకలకు మద్దతు ఇస్తుండగా.. ఆ దేశ ప్రజలు అఫ్గాన్‌ పౌర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ట్రోలింగ్‌ చేస్తున్నారు. దీంతో సహనం నశించిన అఫ్గాన్‌ పౌర ప్రభుత్వ పెద్దలు ఒక్క ఫొటోతో పాక్‌ ట్రోలర్ల పరువు తీశారు. ఆ ఫొటో కూడా భారత్‌కు చెందిన ఒక విజయానికి సంబంధించింది కావడం విశేషం. 

9. stock market: భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు ..! 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఉదయం భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.20 సమయంలో 114 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,747 వద్ద, 405 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ 52,604 వద్ద కొనసాగుతున్నాయి. ఐడీసీఎల్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, అల్కార్గో లాజిస్టిక్స్‌, జుబ్లియంట్‌ ఫుడ్‌ వర్క్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ షేర్ల విలువ పెరిగాయి. 

10. Salman: ‘సల్మాన్‌కి భార్యాపిల్లలున్నారు’
బాలీవుడ్‌ స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ఖాన్‌ తాజాగా ఓ సెలబ్రిటీ రియాల్టీ షో మొదలుపెట్టారు. సెలబ్రిటీలపై వచ్చిన సోషల్‌మీడియా కామెంట్లు.. దానిపై వారి స్పందన గురించి ఈ షోలో చూపించనున్నారు. తాజాగా ఈ షోలో సల్మాన్‌ఖాన్‌ సందడి చేశారు. అర్బాజ్‌ఖాన్‌ షో విజయం సాధించాలని ఆకాక్షించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని