Virtual Labs: ప్రాక్టికల్స్‌కు దూరమయ్యారా..?
close

తాజా వార్తలు

Published : 12/06/2021 23:55 IST

Virtual Labs: ప్రాక్టికల్స్‌కు దూరమయ్యారా..?

ఇంట్లోనే ప్రయోగాల మెళకువలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంజినీరింగ్‌ విద్యలో బోధనతో పాటు ప్రాక్టికల్స్‌ ఎంతో అవసరం. కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమవుతున్న విద్యార్థులు.. ప్రయోగశాలలను వినియోగించుకునే పరిస్థితి లేదు. దీంతో ఇంట్లో ఉంటూనే ప్రాక్టికల్స్ చేసుకునేలా ప్రముఖ విద్యా సంస్థలు వర్చువల్  ప్రయోగశాలలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ విధానం వల్ల ప్రయోగశాలలో ఉన్నట్టుగానే  విద్యార్థులు ప్రాక్టికల్స్ మెళకువలు నేర్చుకుంటున్నారు. 

కరోనా కారణంగా ప్రయోగశాలలకు దూరమైన ఇంజినీరింగ్‌, సైన్స్‌ విద్యార్థుల కోసం ఐఐటీలు, ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థలు వర్చువల్‌ ప్రయోగశాలలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. యానిమేటెడ్‌ డెమాన్స్‌ట్రేషన్‌ విధానంలో విద్యార్థులు ఇంటి వద్ద ఉంటూనే ప్రయోగాలు చేసుకోవచ్చు. వర్చువల్‌ ప్రయోగశాలలపై చాలా కళాశాలలు అవగాహన కల్పించడంతోపాటు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. విజయవాడ, విశాఖలోని కొన్ని కాలేజీలు ఐఐటీ ముంబయితో బ్రాంచీల వారీగా వర్చువల్‌ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నాయి. కళాశాలలే కాకుండా, విద్యార్థులు నేరుగా ఐఐటీల వెబ్‌సైట్లలోకి వెళ్లి ఈ సదుపాయాన్ని పొందుతున్నారు.

మారుమూల ప్రాంతాల్లోని కళాశాలల్లో అధునాతన ప్రయోగశాలల సదుపాయం లేని విద్యార్థులకు వర్చువల్‌ ల్యాబ్స్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కంపెనీల అవసరాల మేరకు నైపుణ్యాలను పెంచుకునేందుకు ఈ విధానం తోడ్పడుతుందని అధ్యాపకులు వెల్లడిస్తున్నారు. వర్చువల్‌ ప్రయోగశాలలు మొదట్లో కొంత కొత్తగా ఉన్నా.. తరువాత అలవాటుపడి సద్వినియోగం చేసుకుంటున్నామని విద్యార్థులు పేర్కొంటున్నారు. సాంకేతిక విద్యతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకునేందుకు వర్చువల్‌ ప్రాక్టికల్స్‌ విధానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని