close

ప్రధానాంశాలు

పంత్‌ బుర్రలో తిరుగుతోన్న ఆ ఆలోచన!

జైపూర్‌: ప్రపంచకప్‌నకు ఎంపిక చేయలేదన్న ఆలోచన తన బుర్రలో తిరుగుతోందని టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ అన్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయం తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. దిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడైన పంత్‌ 36 బంతుల్లో 78 పరుగులు చేసి జట్టును గెలుపుబాట పట్టించాడు. పాయింట్ల పట్టికలో దిల్లీని అగ్రస్థానంలో నిలబెట్టాడు.

‘చాలా ఆనందంగా ఉంది. అత్యంత కీలకమైన మ్యాచ్‌లో జట్టును గెలిపించడం అద్భుతమైన అనుభూతి. అబద్దం చెప్పలేను. ఎంపిక ఆలోచన నా బుర్రలో తిరుగుతోంది. నా ఆటతీరుపై దృష్టి పెట్టాను. అది పనిచేస్తోంది. వికెట్‌ చాలా బాగుంది. బహుశా దానినే అనుకూలంగా ఉపయోగించుకున్నానని అనుకుంటున్నా. మా జట్టులో ఎవరి పాత్ర ఏంటో తెలిసుండటం కీలకం. సహాయక సిబ్బంది మా పాత్రలేంటో చెప్పారు. ఎవరికి ఏం జరుగుతుందో చెప్పారు’ అని పంత్‌ అన్నాడు. కీపింగ్‌లో అనుభవం, ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటంతో పంత్‌ బదులు కార్తీక్‌ వైపు మొగ్గుచూపామని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ వెల్లడించిన సంగతి తెలిసిందే.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net