రాముడి ఉనికిని ప్రశ్నించిన వారిని మరవద్దు!
close

తాజా వార్తలు

Published : 02/11/2020 00:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాముడి ఉనికిని ప్రశ్నించిన వారిని మరవద్దు!

బిహార్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

పట్నా: బిహార్‌లో రెండో విడత ఎన్నికల్లో భాగంగా పార్టీల ప్రచారం జోరుగా సాగింది. పశ్చిమ చంపారన్‌లో జరిగిన భాజపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అడ్డంకులు సృష్టించి, రాముడి ఉనికినే ప్రశ్నించిన వారిని మరవకూడదని ఓటర్లకు సూచించారు. పౌరసత్వ సవరణ చట్టంపైనా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ విపక్షాలపై మోదీ మండిపడ్డారు.

ఎన్‌డీఏ ఎస్‌సీ/ఎస్‌టీ రిజర్వేషన్లను తీసేస్తుందని కొందరు వదంతులు సృష్టిస్తున్నారని..ఎన్‌డీఏ ప్రభుత్వమే మరో పదేళ్లపాటు రిజర్వేషన్లను కొనసాగించిన విషయాన్ని మరవద్దని మోదీ స్పష్టంచేశారు. కొన్ని పార్టీలు జనరల్‌ కేటగిరి వారిని నిర్లక్ష్యం చేశారని.. కానీ, తాము మాత్రం ఆ వర్గంలోని పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించామని అన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఆమోదించారని..ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌ నినాదంతోనే తాము ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంచేశారు. ఇక సీఏఏ గురించి ప్రస్తావించిన ఆయన.. ‘ఈ చట్టం అమలులోకి వస్తే ఎంతో మంది దేశ పౌరసత్వాన్ని కోల్పోతారని కొందరు అసత్య ప్రచారాలు చేశారు. చట్టం అమలులోకి వచ్చి సంవత్సరం గడుస్తోంది. ఇప్పటివరకు ఎంత మంది పౌరసత్వాలు పోయాయి?’ అని మోదీ ప్రశ్నించారు. అంతేకాకుండా నేరమయమైన బిహార్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ప్రధాని మోదీ ఓటర్లకు సూచించారు.

ఇదిలాఉంటే, బిహార్‌లో రెండో విడత ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. నవంబర్‌ 3న జరిగే రెండో విడతలో 94 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని