close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 12/03/2020 18:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మా ఎమ్మెల్యేలను నిర్బంధించారు: కాంగ్రెస్‌

దిల్లీ: మధ్యప్రదేశ్‌కు చెందిన తమ ఎమ్మెల్యేలను బెంగళూరులో భాజపా నిర్బంధించిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. వారు తిరిగి పార్టీలోకి రావాలని అనుకుంటున్నారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. వారిని విడుదల చేయకుంటే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొంది. ఈ మేరకు పార్టీకి చెందిన కొందరు నేతలు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు నిర్బంధానికి గురయ్యారనడానికి ఇదే ఉదాహరణ అంటూ ఓ వీడియోను ప్రదర్శించారు. అందులో పోలీసుతో ఎమ్మెల్యే వాగ్వాదం జరుపుతున్నట్లుగా ఉన్న వీడియోనూ చూపించారు. దీనిబట్టి రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేలను నిర్బంధించారని తెలుస్తోందని, వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే జితూ పట్వారీగా గుర్తించామని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.

జ్యోతిరాధిత్య సింధియా మద్దతుదారులైన 17 మంది ఎమ్మెల్యేలు ఇటీవల ఓ విమానంలో బెంగళూరు చేరిన సంగతి తెలిసిందే. వారితో పాటు మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. సింధియా బుధవారం భాజపాలో చేరారు. దీంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ప్రభుత్వాన్ని కూల్చడంలో భాగంగా భాజపానే ఈ కుట్ర పన్నిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఎమ్మెల్యేలను మోసపుచ్చి, లంచం ఇచ్చి బెంగళూరు తరలించారని, వారు ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లోకి రావాలని కోరుకుంటున్నారని ఆ పార్టీ తెలిపింది. మరోవైపు ఈ నెల 16న బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ను కోరేందుకు భాజపా సన్నద్ధం అవుతోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.