ఈ దేశ ఆడపడుచులు మిమ్మల్ని క్షమించరు
close

తాజా వార్తలు

Updated : 07/09/2020 17:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ దేశ ఆడపడుచులు మిమ్మల్ని క్షమించరు

దేశం కోసం ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమని వెల్లడి

ముంబయి: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌పై నటి కంగనా రనౌత్‌ మండిపడింది. తన నుంచి క్షమాపణలు కోరేందుకు ఎంపీకి ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది. మీరేం మహారాష్ట్ర కాదు అని ఓ వీడియోలో పేర్కొటూ దానిని ట్వీట్‌ చేసింది. సుశాంత్‌ మృతి కేసు విచారణ నేపథ్యంలో గతంలో కంగనా మాట్లాడుతూ మూవీ మాఫియా కంటే ముంబయి పోలీసులంటేనే తనకు ఎక్కువ భయంగా ఉందని, భద్రత కల్పించాలంటూ కోరింది. దీనిపై ఘాటుగా స్పందించిన సంజయ్‌ రౌత్‌ ఆమెను ముంబయికి తిరిగి రాకుండా అక్కడే ఉండిపోవాలని సూచించారు. నటి క్షమాపణ కోరితే అప్పడు ఈ విషయంపై ఆలోచిస్తానని అన్నారు. ఎమ్మల్యే ప్రతాప్‌ సరానిక్‌ మాట్లాడుతూ కంగనాను అరెస్టు చేయాలని మహారాష్ట్రకు వస్తే ఇక్కడి మహిళలు ఆమెను కొట్టకుండా వదలరు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

కాగా ఎంపీ వ్యాఖ్యలపై ట్విటర్‌ వేదికగా స్పందించిన స్పందించిన రనౌత్‌ అతడిని స్త్రీ వ్యతిరేకిగా పేర్కొంది. గతంలో ఆమిర్‌ఖాన్‌, నసీరుద్దీన్‌ షా లాంటి నటులు ముంబయిలో ఉండేందుకు భయపడుతున్నాం అని అన్నప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారని, ఓ స్త్రీ అలా అంటే భయాందోళనకు గురిచేస్తున్నారంటూ మండిపడింది. ‘మీలాంటి వారి వల్లనే దేశంలో మహిళలపై అరాచకాలు కొనసాగుతున్నాయి. ఈ దేశ ఆడపడుచులు మిమ్మల్ని క్షమించరు’ అంటూ ఉద్వేగంగా మాట్లాడింది. కేవలం ముంబయి పోలీసులను మాత్రమే నిందించానని, మహారాష్ట్రను మాత్రం కాదని స్పష్టం చేసింది. ‘సంజయ్‌ మీరేం మహారాష్ట్ర కాదు. నేను మిమ్మల్ని నిందించాను, మహారాష్ట్రను కాదు. సెప్టెంబర్‌ 9వ తేదీన ముంబయి వస్తున్నాను. చంపాలనుకుంటే నన్ను చంపేయండి. ఈ దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధంగా ఉన్నాను’ అంటూ పేర్కొంది. 

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని