డిగ్రీ, పీజీ పరీక్షలపై హైకోర్టులో విచారణ
close

తాజా వార్తలు

Published : 10/09/2020 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డిగ్రీ, పీజీ పరీక్షలపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: తెలంగాణలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. వసతి గృహాలు మూసి ఉన్నందున పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడతారని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించగలరా?సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని రెగ్యులర్‌గా పరిగణిస్తారా?అని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను ప్రశ్నించింది. ఇంజినీరింగ్‌ కోర్సులకు నిర్వహించవచ్చని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌ స్పందిస్తూ ప్రభుత్వాన్ని అడిగి తెలియజేస్తానని సమాధానమిచ్చారు. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 15కి వాయిదా వేసింది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని