వరి సన్నరకాలే సాగు చేయాలి
close

తాజా వార్తలు

Updated : 30/03/2021 14:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరి సన్నరకాలే సాగు చేయాలి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని రైతులు వరి సన్న రకాలనే సాగు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఒకరిని చూసి ఒకరు వరి సాగు చేయకపోవడమే మంచిదన్నారు. వానాకాలంలో పత్తి, కంది సాగు విస్తీర్ణం పెంచాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల కోసం పౌరసరఫరాల సంస్థకు ప్రభుత్వం రూ.20 వేల కోట్లకు బ్యాంకు పూచికత్తు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. మంగళవారం ఉదయం మంత్రుల నివాస ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు బాసటగా ఉండాలని సీఎం నిర్ణయించారన్నారు. రాష్ట్రంలోని సాగు పద్ధతుల్లో గణనీయమైన మార్పులు రావాలని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. 

‘‘యాసంగిలో 52.79 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కోటీ 32 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఎఫ్‌సీఐ 80 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేస్తోంది. మిల్లర్లు 20 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేస్తారు. విత్తనాల కంపెనీలు 10 లక్షల మెట్రిక్‌ టన్నులు కొంటాయి.  పొరుగు రాష్ట్రాల మిల్లర్లు 10 లక్షల మెట్రిక్‌ టన్నులు కొంటారు. తేమ శాతం, తాలు నిబంధలకు లోబడి ధాన్యం తేవాలి. పత్తి సాగు విస్తీర్ణం 70 నుంచి 75 లక్షల ఎకరాలకు పెరగాలి. తెలంగాణ పత్తికి ప్రపంచ మార్కెట్లో డిమాండ్‌ ఉంది’’ అని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని