తమిళనాట శశి‘కలవరం’! 
close

తాజా వార్తలు

Updated : 12/02/2021 05:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమిళనాట శశి‘కలవరం’! 

చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ నాలుగేళ్ల విరామం తర్వాత రాష్ట్రానికి చేరుకోవడంతో అన్నాడీఎంకేలో అలజడి మొదలైంది. ఇటీవల శశికళ స్వాగత ఏర్పాట్లలో పాల్గొన్న నేతలపై వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. మున్ముందు శశికళ విధేయులు మరెందరినో తొలగించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, చిన్నమ్మ వైపు ఆకర్షితులు కాకుండా తమ కార్యకర్తలను అన్నాడీఎంకే ఎంతవరకు అడ్డుకోగలదు? రానున్న రోజులు ఆ పార్టీకి మరింత కఠినంగా మారనున్నాయా? అనే ప్రశ్నలు తమిళనాట ప్రధానంగా వినిపిస్తున్నాయి.

తమిళ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే నాయకత్వ లేమిని ఎదుర్కొంటోంది. పార్టీలో ఐకమత్యం కొరవడిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే కార్యకర్తలు ఓ శక్తిమంతమైన నాయకత్వం కోసం వెతుకుతున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో జయలలిత నెచ్చెలి, ఏఐఏడీఎంకే బహిష్కృత నేత శశికళ వైపు వారు మళ్లీ మొగ్గుచూపే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైలులో శిక్ష అనుభవించి చెన్నై చేరుకున్న శశికళకు అభిమానులు భారీ స్వాగతం పలికారు. ఆమెను స్వాగతిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేసిన ఏడుగురు నేతలపై అన్నాడీఎంకే వేటు వేసింది. మరోవైపు, రాజకీయ శక్తిని చాటేందుకే ఆమె బెంగళూరు నుంచి చెన్నై చేరుకొనేందుకు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల కరోనా బారిన పడిన శశికళ చికిత్స అనంతరం బెంగళూరులోని రిసార్టులో విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో ఆమెను పరామర్శించేందుకు అన్నాడీఎంకే నేతలు కొందరు ప్రయత్నించారు. ఆమె తమిళనాడుకు వచ్చే సందర్భంలో శశికళ కారుపై అన్నాడీఎంకే జెండా ఉండటంతో ఆ పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో పోలీసులు ఆ కారు ప్రయాణానికి నిరాకరించడంతో ఆ పార్టీకి చెందిన కృష్ణగిరి తూర్పు జిల్లా యూనియన్‌ కార్యదర్శి తన కారును శశికళకు ఇచ్చారు. దీంతో ఆయనపై పార్టీ వేటు వేసింది. ఇదే తరహాలో మరి కొందరిని కూడా పార్టీ నాయకత్వం తప్పించింది. అయితే, ఇలా అన్నాడీఎంకే నేతలు చిన్నమ్మ చెంతకు చేరడంతో పార్టీలో కలవరం మొదలైనట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి..

ఎన్ని అవతారాలెత్తినాఅణ్ణాడీఎంకేను హస్తగతం చేసుకోలేరుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని