మంచిని ప్రశంసిస్తే మద్దతిచ్చినట్లా?: రత్నప్రభ
close

తాజా వార్తలు

Updated : 28/03/2021 15:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంచిని ప్రశంసిస్తే మద్దతిచ్చినట్లా?: రత్నప్రభ

నా ట్వీట్‌ వైరల్‌ చేస్తున్నారు

అభ్యర్థిత్వంపై పవన్‌ సంతృప్తిగా ఉన్నారు..

తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో తనను గెలిపిస్తే రాష్ట్రం తరఫున పార్లమెంట్‌లో గట్టి స్వరం వినిపిస్తానని భాజపా-జనసేన అభ్యర్థి రత్నప్రభ అన్నారు. ఇన్నాళ్లకు మాతృభూమికి సేవ చేసే అవకాశం తన ముందుందని చెప్పారు. పనిచేయడంలోనే తనకు అమితానందం ఉంటుందన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తిరుపతి కోసమే కాకుండా రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తానన్నారు. 

భాజపాకు జనసేన మద్దతు లేదన్న ప్రచారం సరికాదని రత్నప్రభ చెప్పారు. తన అభ్యర్థిత్వంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ 200 శాతం సంతృప్తిగా ఉన్నారన్నారు. ప్రచారానికి ఆయన్ను ఆహ్వానిస్తే తప్పకుండా వస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. గతంలో సీఎం జగన్‌ను తాను ప్రశంసించిన ట్వీట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారని రత్నప్రభ చెప్పారు. మంచిపని చేస్తే ప్రశంసించానని.. అంతమాత్రాన మద్దతు ఇచ్చినట్లు కాదని స్పష్టం చేశారు. డబ్బుకు ఓటెయ్యాలో.. నీతి నిజాయతీకో ప్రజలు తేల్చుకోవాలన్నారు. 

మరోవైపు రత్నప్రభ రేపు నెల్లూరు ఆర్వో కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని