వైకాపా పాలనలో నగరాలు పతనం: చంద్రబాబు
close

తాజా వార్తలు

Published : 05/03/2021 17:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైకాపా పాలనలో నగరాలు పతనం: చంద్రబాబు

విశాఖ: వైకాపా పాలనలో రాష్ట్రంలోని నగరాలు పతనమయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో తెదేపా కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సులభతర జీవన ర్యాంకింగుల్లో తిరుపతి స్థానం 4 నుంచి 46కు, విజయవాడ 9 నుంచి 41కు పడిపోవడం బాధాకరమన్నారు. ర్యాంకుల పతనం రాష్ట్రంలోని నగరపాలికల పరిస్థితికి అద్దంపడుతోందని విమర్శించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైకాపాకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. ఈ సమావేశంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, నేతలు వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని