ఆసుపత్రిలో డాక్టర్ల ‘సీటీమార్‌’ స్టెప్పులు

తాజా వార్తలు

Published : 17/05/2021 00:01 IST

ఆసుపత్రిలో డాక్టర్ల ‘సీటీమార్‌’ స్టెప్పులు


ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సెకండ్‌ వేవ్‌లో వైద్యులకు కనీసం విశ్రాంతి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. రోజంతా పీపీఈ కిట్లలోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, ఓ ఆసుపత్రిలో వైద్యులు మాత్రం దొరికిన కాస్త సమయాన్ని వినూత్నంగా ఆస్వాదించారు. సల్మాన్‌ఖాన్‌, దిశాపటాని జంటగా నటించిన ‘రాధే’ చిత్రంలోని ‘సీటీమార్‌’ పాటలకు స్టెప్పులేసి సందడి చేశారు. అంతేకాదు ఓ వైద్యుడు సంగీత విద్వాంసుడిగా మారి మాండొలిన్ వాయించాడు. మరికొంత మంది అందుకు తగ్గట్లుగా డ్యాన్స్‌ చేశారు. ఇప్పుడీ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోను దిశాపటాని ఫ్యాన్స్‌ క్లబ్‌ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘వైద్యులే మన రియల్‌ హీరోస్‌’ అంటూ పొగిడేస్తున్నారు. వారిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని