AP News: సింధూశ్రీ‌ మృతిపై వీడిన చిక్కుముడి

తాజా వార్తలు

Updated : 05/06/2021 14:47 IST

AP News: సింధూశ్రీ‌ మృతిపై వీడిన చిక్కుముడి

 

విశాఖ‌: న‌గ‌రంలోని మ‌ధుర‌వాడ మారిక‌వ‌ల‌స‌లో క‌ల‌క‌లం రేపిన మూడేళ్ల చిన్నారి సింధూశ్రీ‌ మృతిపై చిక్కుముడి వీడింది. వివాహేత‌ర సంబంధ‌మే చిన్నారి మృతికి కార‌ణంగా పోలీసులు నిర్ధ‌రించారు. చిన్నారి త‌ల్లి ప్రియుడు జ‌గ‌దీశ్‌ను పోలీసులు హంతుకుడిగా తేల్చారు. వివ‌రాల్లోకి వెళ్తే.. బోరవానిపాలెంకు చెందిన బి.రమేష్‌(27)తో మారికవలసకు చెందిన పీతల వరలక్ష్మికి 2014లో వివాహమైంది. వీరికి సింధూశ్రీ అనే మూడేళ్ల కుమార్తె ఉంది. మరో వ్యక్తితో వరలక్ష్మికి వివాహేతర సంబంధం ఉందనే కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆ నేపథ్యంలోనే వీరు విడిపోయారు. 

వరలక్ష్మి తన మూడేళ్ల చిన్నారితో కలిసి ఈ ఏడాది మే 14న వేరే కాపురం పెట్టింది. ఇదిలా ఉండగా.. జూన్ 2న వరలక్ష్మి రమేశ్‌కు ఫోన్‌చేసి పాప చనిపోయిందని తెలిపింది. దీంతో ఆవేదన చెందిన రమేశ్‌.. కుటుంబ సభ్యులతో కలిసి భార్య వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే అంత్యక్రియలు పూర్తి చేశారు. పాప మృతిపై అనుమానం వ్యక్తం చేసిన రమేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. వ‌ర‌ల‌క్ష్మి ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పీఎంపాలెం పోలీసులు విచారించారు. తానే చిన్నారిని హ‌త్య చేసిన‌ట్లు ఒప్పుకున్నాడ‌ని వారు తెలిపారు. జూన్‌1 అర్ధ‌రాత్రి చిన్నారిని చంపేసి అప్పుడే అంత్య‌క్రియ‌లు చేసిన‌ట్లు నిందితుడు చెప్పిన‌ట్లు వివ‌రించారు. 30 గంట‌ల్లోగా పోలీసులు కేసును ఛేదించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని