close

తాజా వార్తలు

Published : 29/06/2020 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఊబకాయాన్ని తగ్గించే డ్యాన్స్‌

మీ పిల్లలు రుచులకోసం జంక్‌ఫుడ్‌ తినడం, వ్యాయామానికీ దూరంగా ఉండటం వంటివి చేస్తున్నారా? అలాంటి చిన్నారులకు సరదాగా డ్యాన్స్‌ నేర్పేయండి. ఆనందంతో పాటు ఆరోగ్యాన్నీ పంచండి.

* డ్యాన్స్‌ శరీరాన్ని తేలికపరుస్తుంది. కండరాలను సౌకర్యంగా మారుస్తుంది. డ్యాన్స్‌లోని వివిధ భంగిమల్ని ఒకటికి రెండు సార్లు ఓ క్రమ పద్ధతిలో చేయడం వల్ల కండరాలకు మర్దన ఫలితం అందుతుంది.

* మెదడు, శరీరం మధ్య సమన్వయాన్ని అందిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. శరీరానికి తగిన శ్రమ అందుతుంది. ఇలా కనీసం ఇరవై నిమిషాల పాటు చేయగలిగితే మంచిది.

* నృత్యాన్ని సాధన చేసే చిన్నారులకు నలుగురిలో ఇమిడిపోయే తత్వం, సామాజిక చొరవ, సమయ స్ఫూర్తి అలవడతాయట. అంతేకాదు ఎదుటివారి హావభావాలనూ సులువుగా అర్థం చేసుకోగలరు అంటున్నారు మానసిక నిపుణులు.

మరిన్ని ఆసక్తికర కథనాలు https://epaper.eenadu.net లో



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని