
తాజా వార్తలు
టిఫినీలు చేయట్లేదా!
సమయం లేదనే వంక కావచ్చు, బరువు పెరుగుతామనే అభిప్రాయం కావచ్ఛు. చాలామంది అమ్మాయిలు ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడానికి ఇష్టపడరు. దీనివల్ల దీర్ఘకాలంలో ఎన్నో అనారోగ్య ముప్పుల్ని ఎదుర్కోవలసి వస్తుంది.
శారీరక అనారోగ్యం: పొద్దున్న అల్పాహారం మానేస్తే మిగిలిన రోజంతా తినే ఆహారంపై ప్రభావం పడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. శరీరంలో కెలొరీలు పేరుకుపోతాయి. దాంతో అధిక బరువు, మధుమేహం, నెలసరి సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, సంతానసాఫల్య సామర్థ్యం లోపించడం, గుండె జబ్బుల్లాంటి సమస్యలూ ఎదురవుతాయి. అలాకాకుండా పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని పొద్దున్నే తీసుకుంటే జీవక్రియ రేటు మెరుగుపడుతుంది.
మానసిక ఆరోగ్యం: పొద్దుటిపూట మూడీగా ఉండేవారు.. దాన్నుంచి బయటపడి ఉత్సాహంగా కనిపించాలంటే..అల్పాహారం తీసుకోవడానికి మించిన పరిష్కారం లేదని చెబుతున్నారు నిపుణులు. అలా తీసుకునేవారు రోజంతా చురుగ్గా ఉంటారు.