close

తాజా వార్తలు

Updated : 30/03/2021 05:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రుచికరమైన ఘుమఘుమలు!

కూరలకు కమ్మటి రుచి, చిక్కదనం రావాలనుకుంటున్నారా...  రెస్టారెంట్‌లోని వంటల మాదిరి ఘుమఘుమలాడాలనుకుంటున్నారా... అయితే వెల్లుల్లి, ఉల్లి, టొమాటో మసాలా పొడులను వేయాల్సిందే. మరి వీటిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందామా..
వెల్లుల్లి... ముందుగా అరకిలో వెల్లుల్లిని పాయలుగా విడదీసుకోవాలి. ఆ తర్వాత వీటిని బాగా కడిగి స్ట్రెయినర్‌లో పదిహేను నిమిషాలపాటు పెడితే నీళ్లు పూర్తిగా పోతాయి. ఇప్పుడు పాడైన వెల్లుల్లి రెబ్బలను తీసేసి మిగతావాటిని ఒకసారి మిక్సీలో వేసి తిప్పాలి. బరకగా ఉన్నప్పుడే బయటకు తీసి వెడల్పాటి పళ్లెంలో వేసి మూడు నాలుగు రోజులు ఎండలో ఆరబెడితే పూర్తిగా ఎండిపోతాయి. దీన్ని మిక్సీలో వేసి తిప్పితే ఘుమఘుమలాడే వెల్లుల్లి పొడి సిద్ధమవుతుంది. దీన్ని పెద్ద జల్లెడతో ఓసారి జల్లించితే పొడి సిద్ధమైపోతుంది. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో వేసుకుని నిల్వ చేసుకోవాలి.
ఉల్లి... ముందుగా పెద్ద ఉల్లిపాయలను ఓ కేజీ తీసుకోవాలి. వీటిని పొట్టు తీసి సన్నగా తురమాలి. వెల్లుల్లి మాదిరిగానే వీటిని కూడా ఎండబెట్టాలి.  ఇలా పూర్తిగా ఆరిన ఉల్లిపాయ ముక్కలను మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది.
టొమాటో... ముందుగా కిలో టొమాటోలను శుభ్రంగా కడిగి కొంచె పెద్దముక్కలుగా కోసుకోవాలి. వీటిలోని నీళ్లు పోవాలంటే పాన్‌లో వేసి బాగా ఉడికించాలి. ఆ తర్వాత ఓ పళ్లెంలో నూనె రాసి అందులో ఈ మిశ్రమాన్ని సన్నటి పొరలా వేయాలి. దీన్ని మూడు నాలుగు రోజులపాటు ఎండలో పెట్టి పొడి చేసుకోవాలి. అంతే అవసరమైనప్పుడల్లా అన్ని కూరల్లో ఈ మసాలాలను వేసుకుంటే రుచితోపాటు సువాసనా పెరుగుతుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని