close
Array ( ) 1

తాజా వార్తలు

ఎంతో సాయం...అల్యూమినియం!

హాయ్‌ఫ్రెండ్స్‌... నేనో మూలకాన్ని. మీకు నేను చాలా పరిచయమే... ఎలాగబ్బా? అంటారా? ఇదిగో మీ సైకిళ్ల చక్రాలు, ఇళ్లపై రేకులు, మేకులు... అంతేనా?! ఇంకా బోలెడన్ని వంటపాత్రలు ఇలా చాలా వస్తువులు తయారయ్యేది నాతోనే మరి. అయితే నా గురించి మీకు తెలియని విషయాలూ ఉన్నాయ్‌. అవేంటో చదివేయండి!


నా పరిచయం!

* నా పేరు... అల్యూమినియం. ఒక రసాయన మూలకాన్ని. నన్ను తిః అనే సంకేతంతో తెలియజేస్తారు. నా పరమాణు సంఖ్య 13.
* అత్యధికంగా లభించే మూలకాలైన ఆక్సిజన్‌, సిలికాన్‌ తరువాత మూడో మూలకాన్ని నేనే.
* వెండి తెలుపురంగులో ఉండే తేలికైన లోహాన్ని. మెత్తగా ఉండడమేగాక సాగే గుణమున్నదాన్ని.
* నేను అయస్కాంత పదార్థాన్ని కాదు. కానీ మంచి విద్యుత్‌, ఇంకా ఉష్ణవాహకాన్ని.
* మెత్తగా ఉండే నేను ఇతర లోహాలతో కలిసి మిశ్రమలోహంగా మారానంటే అది చాలా బలంగా, గట్టిగా ఉంటుంది.
* 1808లో తొలిసారిగా హంఫ్రీ డేవిడ్‌ నా ఉనికిని పట్టికలో గుర్తించాడు. తర్వాత నాకు ‘అల్యూమినియం’ అనే పేరు పెట్టారు.
* నన్ను బాక్సైట్‌ ఖనిజం నుంచి రాబడతారు.


నేను చేసే మేలు!

* ఇందాక చెప్పినట్టు... పలుచని రేకులు, సైకిల్‌ చట్రాలు, నిచ్చెనలు, పిన్నులు కొట్టే పరికరాలు, మేకులు, కంప్యూటర్‌ భాగాలు, కిటికీ చట్రాలు, పాత్రలు, పెనాలు, గేట్లు, కారు రిమ్ములు, విమాన విడిభాగాలు, పెన్సింగ్‌లు ఇలా బోలెడన్ని నాతోనే తయారవుతాయి.
* సీడీలు, కారు రిఫ్రిజిరేటర్లు, వంటసామగ్రి, ఆహారం, ఔషధాలు ప్యాకింగ్‌ చేసేందుకు కూడా నన్ను వినియోగిస్తారు.
* మోటారు వాహనాల్లో కచ్చితంగా సరిపడే గొట్టాలు, ఎయిర్‌ కండిషనర్లలో, సోలార్‌ పానల్స్‌లోనూ నన్ను వాడేస్తారు.
* ఇళ్లకు సరఫరా చేసే పవర్‌లైన్స్‌గా ఉపయోగిస్తారు.
* సీపీయూలు, గ్రాఫిక్‌ ప్రాసెసర్స్‌ చల్లార్చేందుకు నన్ను హీట్‌ సింకులుగా తయారుచేస్తారు.


తేలిగ్గా..  బలంగా

* నాకు తుప్పుపట్టదు. చాలా నెమ్మదిగా క్షీణిస్తుంటా. అప్పుడు నా మీద అల్యూమినియం ఆక్సైడ్‌ ఏర్పడుతుంది. ఇది చాలా గట్టి పదార్థం. ఈ పదార్థమే నన్ను మరింత క్షీణించకుండా రక్షిస్తుంది.
* చాలా బలమైనదాన్ని. చల్లగా అవుతున్నకొద్దీ నా బలం పెరిగిపోతుంది.
* నేను తేలికగా ఉండటం వల్ల రవాణా రంగంలో బాగా ఉపయోగిస్తారు.
* దాదాపు 270 ఖనిజాల్లో లభిస్తుంటా.
* ప్రపంచవ్యాప్తంగా నన్ను చాలా వరకు ఉపయోగిస్తున్నారు.
* మీ ఆహార పదార్థాల్లోనూ నేను ఉంటా. బంగాళాదుంప,  పాలకూర, కాయగూరల్లో ఉంటాను.
* నేను విషపూరితం కాదు కాబట్టి నాతో తయారుచేసిన వంటపాత్రలు, గరిటెలు, అట్లకాడలు వంటివి అందుబాటులోకి వచ్చాయి.
* వందశాతం పునర్వినియోగమయ్యే లోహాన్ని.


జాగ్రత్త సుమా!

* నా ధూళి వల్ల మీ ఊపిరితిత్తులు ప్రభావితమవుతాయి. దగ్గు, శ్వాస ఇబ్బందులు వస్తాయి.
* శరీరంలోకి నేను ఎక్కువగా చేరకుండా ఉండాలంటే నాతో తయారైన పాత్రల్లో వంట చేసుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
* నా పాత్రకు పెద్దమంట పెట్టకూడదు.
* నా పాత్రల్లో ఉడికే పదార్థాలకు కర్రగరిటెలు ఉపయోగించడం మంచిది.
* పుల్లటి పదార్థాల్ని నా పాత్రల్లో వండకూడదు.
* నా పాత్రల్లో వండినా అందులో ఉండగా ఉప్పు వేయకూడదు. స్టెయిన్‌ లెస్‌ స్టీలు పాత్రలోకి పదార్థాలు మార్చుకుని అప్పుడు ఉప్పు కలుపుకోవాలి.
* కాఫీ, టీలు ఎక్కువకాలం నా లోహంతో తయారైన కెటిల్స్‌లో మరిగించకూడదు.
* పాతబడిన నా లోహ పాత్రల్ని వాడొద్దు.

- డాక్టర్‌. సి.వి. సర్వేశ్వరశర్మ


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.