close

తాజా వార్తలు

Published : 29/06/2020 09:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.26 సమయంలో సెన్సెక్స్‌ 324 పాయింట్లు నష్టపోయి 34,846 వద్ద, నిఫ్టీ 94 పాయింట్లు నష్టపోయి 10,288 వద్ద ఉన్నాయి. దేశంలో కరోనావైరస్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరిగి పోతుండటం, మళ్లీ చాలా ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్లు విధిస్తారనే వార్తలు వస్తుండటంతో సూచీలు నష్టాలబాట పట్టాయి. దీంతో పాటు ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవడం ప్రభావం చూపింది.  భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో ఉందని ఎస్‌అండ్‌పీ హెచ్చరిండంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు -5శాతం ఉండొచ్చని అంచనావేసింది.  ముఖ్యంగా వైరస్‌ను అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలం కావడం వంటి కారణాలతో ఈ అంచనాలను వెలువరించింది. నేడు మొత్తం 586 కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటిల్లో ఎమ్మారెఫ్‌, భారత్‌ ఫోర్జ్‌, జీఎంఆర్‌ ఇన్ఫ్రా, వంటి కంపెనీలు ఉన్నాయి. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని