నష్టాల్లో ముగిసిన మార్కెట్లు 
close

తాజా వార్తలు

Published : 29/06/2020 15:54 IST

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు 

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 209 పాయింట్లు నష్టపోయి 34,961 వద్ద, నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 10,312 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, లోహరంగ షేర్లు భారీగా పతనం కావడంతో సూచీలు నేల చూపులు చూశాయి. ఎస్‌ అండ్‌ పీ సంస్థ భారత్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో చిక్కుకుంటుందని పేర్కొనడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దాదాపు -5శాతం వృద్ధిరేటు ఉంటుందని ఈ సంస్థ పేర్కొంది. 

పాకిస్థాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీపై దాడి జరగడం వంటి కారణాలు దీనికి తోడయ్యాయి. ముఖ్యంగా యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్ ఫైనాన్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు దాదాపు 4శాతం వరకు విలువ కోల్పోయాయి.  ఎస్‌అండ్‌పీ సంస్థ యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌కు రేటింగ్‌ తగ్గించడం కూడా ప్రభావం చూపింది. మరోపక్క ఐటీసీ షేర్లు భారీగా పెరిగాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని