భారీ లాభాల్లో మార్కెట్లు 
close

తాజా వార్తలు

Published : 06/07/2020 09:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ లాభాల్లో మార్కెట్లు 

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.36 సమయంలో సెన్సెక్స్‌ 323 పాయింట్లు లాభపడి 36,345 వద్ద, నిఫ్టీ 109పాయింట్లు లాభపడి 10,716 వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీఐ, ప్రిసమ్‌ జాన్సన్‌, ఈక్లెరిక్స్ సర్వీస్‌,  చంబల్‌ ఫర్టిలైజర్స్‌, జియో కార్ప్‌ లాభాల్లో ఉండగా.. హిమత్‌సిగ్కా సెడీ, ఒమాక్స్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, జైన్‌ ఇరిగేషన్‌, రిలయన్స్‌ ఇన్ఫ్రా నష్టాల్లో ఉన్నాయి. నేడు 35 కంపెనీలు మార్చి త్రైమాసికం ఫలితాలను ప్రకటించనున్నాయి. 
మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌, ద.కొరియా మార్కెట్లు లాభాల్లో ఉండగా.. హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు నష్టపోతున్నాయి. ఇక బ్రెంట్‌ క్రూడ్‌ ధర 15శాతం పెరిగి 42.95 డాలర్లకు చేరింది. 

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని