close

తాజా వార్తలు

Updated : 10/08/2020 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్మీ సోషల్‌మీడియా వెనుక... మేజర్‌ ఆర్చీ!

భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతం... రాత్రి పూట ఎముకలు కొరికే చలిలో భుజాన తుపాకీతో, బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ను ధరించిన ఓ యువతి ఒక్కొక్క పోస్ట్‌లోని నైట్‌ విజన్‌ డివైస్‌ను పరీక్షించుకుంటూ ముందుకెళ్తోంది. అలా ఎన్నో రాత్రులు విధులు నిర్వహించిన ఆమె, ఒక్కోసారి శత్రువులుండే ప్రాంతానికి దగ్గరగా వెళ్లాల్సి వచ్చేది. అయినా అధైర్యపడేది కాదు. ఆ ధీర వనితే... మేజర్‌ ఆర్చీఆచార్య. ప్రస్తుతం ఇండియన్‌ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌ను నిర్వహిస్తూ... భారత రక్షణ దళానికీ ప్రజలకూ ఓ వారధిని నిర్మిస్తోంది.

ధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆర్చీ ఆచార్య కుటుంబం ఉండేది. ముగ్గురు ఆడపిల్లల్లో ఆర్చీ చిన్నది. ఆర్చీకి అయిదేళ్లపుడు తండ్రి క్యాన్సర్‌తో చనిపోయారు. దాంతో కుటుంబానికి తల్లి పెద్ద దిక్కు అయ్యింది. పిల్లల్ని బాగా చదివించాలనుకుంది. ఆర్చీ ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు తన స్కూల్‌కి వెళ్లే దారిలో హోర్డింగ్‌మీద ఆర్మీ ప్రకటన కనిపించింది. అందులో ఆలివ్‌గ్రీన్‌ యూనిఫామ్‌ వేసుకున్న ఓ సైనికుడు... ‘ఆ సత్తా మీలో ఉందా’ అని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్న తనని అడుగుతున్నట్టే ఫీలయ్యేది ఆర్ఛీ చివరకు ఆ సత్తా తనలో ఉందని నమ్మింది. పెద్దయ్యాక సైన్యంలో చేరతానని తల్లితో చెప్పింది. ఆమె అభ్యంతరం చెప్పలేదు. బాగా చదువుకోవాలని మాత్రమే చెప్పింది. ఇంటర్మీడియెట్‌ తర్వాత ప్రతిష్ఠాత్మక నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చేరాలనుకుని దరఖాస్తు కూడా చేసింది ఆర్ఛీ కానీ అక్కడ అమ్మాయిలకి ప్రవేశం లేదని తెలుసుకుని ఎంతో నిరుత్సాహపడింది.

ఇంజినీరింగ్‌ పూర్తిచేసి...

మహిళలు ఆర్మీలో చేరాలంటే డిగ్రీ అర్హతతోనే సాధ్యమని తెలుసుకున్న ఆర్ఛీ.. జేఎన్‌యూ- దిల్లీ నుంచి ‘ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌’ విభాగంలో ఇంజినీరింగ్‌లో చేరింది. ‘ఇంజినీరింగ్‌ పూర్తవగానే ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం వచ్చింది. అదే సమయంలో ఆర్మీలో చేరడానికి రాసిన ‘సర్వీసెస్‌ సెలెక్షన్‌ బోర్డ్‌’ రాత పరీక్ష పాసయ్యా. ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లలో చాలామంది ఆర్మీ నేపథ్యం ఉన్న కుటుంబాల వాళ్లే. మా కుటుంబంలో ఎవరూ ఆర్మీలో పనిచేసింది లేదు. ఆ తర్వాత నాలుగు నెలలకు నేను సర్వీసుకి ఎంపికైనట్టు సమాచారం వచ్చింది. కుటుంబ సభ్యుల్లో కొందరు వద్దన్నా నేను మాత్రం చేరతానన్నా. అమ్మ మద్దతు నాకే ఉంది. అలా చెన్నై ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో చేరి ఏడాది శిక్షణ తీసుకున్నా. తర్వాత పాక్‌ సరిహద్దులోని రాజౌరీలో 2009లో విధుల్లో చేరా. ర్యాపిడ్‌ బెటాలియన్‌లోని స్ట్రైక్‌ కార్ప్స్‌, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ యూనిట్స్‌ విభాగంలో చేరా. అక్కడ సైనిక వాహనాలు, సైనికులు విధుల్లో వినియోగించే వస్తువుల పనితీరుని పరీక్షించి, అవసరమైన వాటికి మరమ్మతు చేయడం నా పని. చేరిన కొత్తలోనే సరిహద్దులో అర్ధరాత్రి సమయాల్లో ‘నైట్‌ విజన్‌ డివైసెస్’ ను పరీక్షించమన్నారు. ఇందుకోసం చాలా దూరం పెట్రోలింగ్‌ విధులను నిర్వర్తించాల్సి వచ్చేది. మా బృందంలో ఒక్కదాన్నే అమ్మాయిని. ఒక్కోసారి 24 గంటలపాటు ట్రక్కులో ప్రయాణించాల్సి వచ్చేది. అటువంటప్పుడు వాష్‌రూంకెళ్లాలంటే ఏదైనా గ్రామం వచ్చినప్పుడు ఎవరిదైనా ఇంటి తలుపు తట్టేదాన్ని. మిలటరీ దుస్తుల్లో ఉన్న నన్ను వారంతా వింతగా చూసేవారు. మహిళలు ఈ రంగంలోకి రావడం వారికి కొత్తగా ఉండేది’ అని చెబుతుంది ఆర్ఛీ సర్వీసులో ఉంటూనే ప్రత్యేక అనుమతి తీసుకుని పీజీ పూర్తి చేసింది.

సోషల్‌ మీడియాలో

కార్గిల్‌ విజయం అనంతరం ప్రజలకు మరింత చేరువ కావాలనుకుంది ఇండియన్‌ ఆర్మీ. దిల్లీ ప్రధాన కార్యాలయంలో ‘అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ (ఏడీజీపీఐ) విభాగం ఆధ్వర్యంలో దీనికోసం వెబ్‌సైట్‌, యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించింది. పాక్‌ సరిహద్దులో తొమ్మిదేళ్లు పనిచేసిన ఆర్ఛీ.. రెండేళ్లక్రితం వీటి నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. భారత సైనికదళం దేశానికి అందిస్తున్న సేవలు, ప్రాణాలకు తెగించి వారు చేస్తున్న పోరాటాలు వంటి అంశాలను ప్రజలకు తెలియజేస్తోంది. వారి సేవాభావంపైనా అవగాహన కలిగిస్తోంది. సోషల్‌ మీడియా ద్వారా ఎందరో త్యాగమూర్తుల గురించి స్ఫూర్తి కథనాల్ని చెబుతూ సైన్యంలో చేరే దిశగా యువతకు పిలుపునిస్తోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.