బిడ్డలతో సహా నిప్పంటించుకున్న మహిళ
close

తాజా వార్తలు

Updated : 24/04/2021 07:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బిడ్డలతో సహా నిప్పంటించుకున్న మహిళ

తల్లీకుమార్తె దుర్మరణం

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ తల్లి.. తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు యత్నించారు. ఆమెతో పాటు కుమార్తె చనిపోగా కుమారుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాళెం దగ్గర ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం... నెల్లూరులోని నవాబుపేటకు చెందిన సుబ్బులు(28), ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గార్లపెంటకు చెందిన కొండ్రెడ్డి భార్యాభర్తలు. వీరికి మహేష్‌బాబు(8), మధురవాణి(5) అనే పిల్లలున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి వలస వెళ్లి పదెకరాల్లో రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టి అంజూర సాగు చేశారు. పంట బాగా పండిందనుకున్న సమయంలో కరోనా రెండోదశ వీరి ఆశలను దెబ్బతీసింది. అంజూరను అమ్ముకునే అవకాశాలు లేక పెట్టుబడి దక్కక ఆర్థికంగా కుదేలయ్యారు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన సుబ్బులు తన ఇద్దరు పిల్లలతో నెల్లూరులోని పుట్టింటికి వస్తూ శుక్రవారం తెల్లవారుజామున నెల్లూరుపాళెం దగ్గర బస్సు దిగారు. అనంతరం తన దగ్గరున్న శానిటైజర్‌ను తనతో పాటు బిడ్డలపై పోసి నిప్పంటించుకున్నారు. వేడికి భయపడిన మహేష్‌బాబు అక్కడి నుంచి పరుగుతీసి తప్పించుకున్నాడు. సుబ్బులు, మధురవాణి మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. ఈ విషయాన్ని మహేష్‌.. నెల్లూరుపాళెం వాసులకు చెప్పగా వారు పోలీసులకు, తండ్రి కొండ్రెడ్డికి సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు... మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని