జగన్‌కు జైలు భయం పట్టుకుంది: లోకేశ్‌
close

తాజా వార్తలు

Updated : 14/02/2020 15:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగన్‌కు జైలు భయం పట్టుకుంది: లోకేశ్‌

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి లోకమంతా అవినీతి కనపడటంలో ఆశ్చర్యం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. దేశంలోని 40 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తే రూ.85లక్షలు దొరికాయని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ ఇంట్లో రూ.2వేల కోట్లు దొరికాయని వైకాపా ఎలా చెబుతోందని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ అదేదో గొప్ప పని అనుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌కు జైలు భయం పట్టుకుందని లోకేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఐటీ దాడులను తెదేపాకు ముడి పెట్టాలని తాపత్రయపడుతున్నారనీ.. 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి అందరూ జైలుకు వెళ్లాలని కోరుకుంటారని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

వివేకా హత్య కేసుపై ఎన్నిసార్లు మాట మారుస్తారు?

కేసుల విచారణకు జగన్‌ ఎందుకు సహకరించడం లేదని తెదేపా సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. పదవులతో సంబంధం లేకుండా విచారణకు సహకరించాలి కదా? అని అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టానికి ఎవరూ అతీతులుకాదనీ.. అవినీతిలో కూరుకుపోయినవాళ్లే అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. సీబీఐ అధికారులను మార్చాలని అడగడం ఎంతో దౌర్భా్గ్యమన్నారు. వివేకా హత్య కేసుపై ఎన్నిసార్లు మాట మారుస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఎన్నికల్లో వైకాపా నేతలు భారీగా ఖర్చు పెట్టారనీ.. ఆ ఖర్చుకు లెక్కలు చూపించరా? అని నిలదీశారు. అక్రమాస్తుల కేసులో జగన్‌కు శిక్ష పడటం ఖాయమన్నారు.

దేశమంతా ఐటీ సోదాలు జరిగితే తెదేపాకు అంటగట్టడమేంటి?

ఐటీ దాడులను తెదేపాకు ముడిపెట్టడం కక్షసాధింపేనని తెదేపా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీ దాడులు జరిగాయనీ.. ఆయన ఇంట్లో దొరికింది రూ.70 లేదా రూ.80వేలు మాత్రమేనన్నారు. ఐటీ సోదాల్లో రూ.2వేల కోట్లు శ్రీనివాస్‌ ఇంట్లో దొరికాయని వైకాపా దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఐటీ సోదాలకు తెదేపాకు ఎలాంటి సంబంధంలేదన్నారు. కేంద్రం మెడలు వంచుతా అంటున్న జగన్‌మోహన్‌ రెడ్డి దిల్లీకి వెళ్లి తన మెడలనే వంచుతున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి మరకలను తెదేపాకు, చంద్రబాబుకు అంటించాలని సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు.

జగన్‌ వ్యాఖ్యలు విడ్డూరం: అశోక్‌ బాబు

రాజ్యాంగంలో క్యాపిటల్‌ పదం లేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు.  రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని విష ప్రచారం చేస్తున్నారన్నారు. జీఎన్‌రావు కమిటీ నివేదిక రాకుండానే సీఎం మూడు రాజధానుల ప్రతిపాదన ఎలా చెప్పారు?అని నిలదీశారు. రాజధాని కోసం న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు.

 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని