
తాజా వార్తలు
చేతులెత్తి మొక్కుతా.. చేయిచేయి కలపకురా..!
‘చౌరస్తా’ బృందం మరో చైతన్య గీతం
‘‘చేతులెత్తి మొక్కుతా చేయిచేయి కలపకురా..
కాళ్లు కూడ మొక్కుతా అడుగు బయట పెట్టకురా.. ఉన్నకాడే ఉండరా గంజితాగి పండరా..
మంచి రోజులొచ్చెదాకా నిమ్మలంగా ఉండరా..!’’
‘‘ఏ సిగరెట్లు, చాక్లెట్లు, రోడ్ల మీద ముచ్చట్లు
బతికుంటే పెట్టుకుందాం ఇప్పుడైతే బందువెట్టు..
ప్రజలందరి ప్రాణాలు నీ చేతిల ఉన్నయిరా..
బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా..!’’
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: ఇప్పుడు ఏ ఫోన్ చూసినా.. ఎక్కడ విన్నా ఇదే పాట. విడుదలైన కొద్ది సేపట్లోనే సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. జనజీవనాన్ని జానపదంలో బంధిస్తూ కుర్రకారుకు చేరువవుతున్న ‘చౌరస్తా’ బృందం.. కరోనా నేపథ్యంలో మరో చైతన్య గీతంతో జనం ముందుకొచ్చింది. రామ్, శ్రీనివాస్, యశ్వంత్, బాలా.. ఈ నలుగురు మిత్రులు కలిసి ప్రారంభించిన ఈ తెలుగు జానపద బ్యాండ్ చైతన్య గీతాలతో తమదైన ముద్ర వేసుకుంటోంది. ‘పౌరుల్లో కొరవడిన స్పృహ వైరస్ విస్తరించేందుకు సహకరిస్తోంది. ప్రభుత్వాలు ఎంత వద్దని చెప్పినా ఏ అవసరం లేకున్నా కొందరు రోడ్లపైకి వస్తున్నారు. వీరి నిర్లక్ష్యం వల్ల దేశం ఎలా నష్టపోతోందో చెపుతూ.. పౌర బాధ్యతను గుర్తు చేసేందుకే ఈ పాట రాసినట్లు’ చౌరస్తా బృంద సభ్యుడు, గాయకుడు రామ్ మిరియాల తెలిపారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- స్వాగతం అదిరేలా..
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- అమ్మో.. టీమ్ఇండియాతో అంటే శ్రమించాల్సిందే
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- తొలిరోజే కీలక ఆదేశాలు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
