జగిత్యాలలో మరో పాజిటివ్‌ కేసు
close

తాజా వార్తలు

Updated : 12/05/2020 11:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగిత్యాలలో మరో పాజిటివ్‌ కేసు

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో మంగళవారం కొత్తగా మరో పాజిటివ్‌ కేసు నమోదైంది. ముంబయి నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌ తెలిపారు. ఇటీవల ముంబయి నుంచి పలువురు జిల్లాకు రాగా వారిని అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు. వారిలో ఆరుగురు  అనుమానితుల శాంపిళ్లను పరీక్షించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి తెలిపారు. ఇప్పటికే జిల్లాలో నాలుగు పాజిటివ్‌ కేసులు ఉండగా అందులో ముగ్గురు కోలుకుని ఇళ్లకు చేరారు. ఒకరు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ తాజాగా మరో కేసు నమోదు కావటం జిల్లా వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. 

మరోవైపు లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు నేపథ్యంలో జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి తాకిడి పెరిగింది. ఇందులో భాగంగా ఇవాళ ముంబయి నుంచి 1395 మంది జిల్లాకు చేరారు. వారందరినీ హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ముంబయిలో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి నుంచి జిల్లాకు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచి క్వారంటైన్‌లో ఉండేలా చూడాలని అధికారులను కోరుతున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని