తెదేపా, వైకాపా ఘర్షణ.. 25 మందికి గాయాలు
close

తాజా వార్తలు

Published : 30/05/2020 17:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెదేపా, వైకాపా ఘర్షణ.. 25 మందికి గాయాలు

సంతబొమ్మాళి: శ్రీకాకుళం జిల్లాలో తాగునీటి బోరుబావి విషయంలో తెదేపా, వైకాపా మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతతకు దారితీసింది. జిల్లాలోని సంతబొమ్మాళి మండలం పందిగుంటలో తెదేపా, వైకాపా మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన వారు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 25 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించారు. ఘర్షణ నేపథ్యంలో పందిగుంట గ్రామంలో ఉన్నతాధికారులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని