close

తాజా వార్తలు

Published : 21/04/2021 13:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా ముప్పును తగ్గించే సాధనాలు ఇవే..

మల్టీ విటమిన్లు, ఒమేగా-3, ప్రొబయాటిక్స్‌

దిల్లీ: మల్టీ విటమిన్లు, ఒమేగా-3, ప్రొబయాటిక్స్‌ లేదా విటమిన్‌ డి సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కొవిడ్‌ సోకే ముప్పు తగ్గుతుందని తాజా పరిశోధన తేల్చింది. ముఖ్యంగా మహిళలకు ఇవి అధిక ప్రయోజనం కలిగిస్తాయని వివరించింది. బ్రిటన్‌లోని కింగ్స్‌ కాలేజీ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు ‘కొవిడ్‌-19 సింప్టమ్‌ స్టడీ యాప్‌’లోని వినియోగదారుల డేటాను పరిశీలించారు. క్రమం తప్పకుండా సప్లిమెంట్లు తీసుకుంటున్న వారికి కరోనా సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందా అన్నది విశ్లేషించారు. ఈ యాప్‌ను గత ఏడాది మార్చిలో బ్రిటన్, అమెరికా, స్వీడన్‌లో ప్రవేశపెట్టారు. అందులో వినియోగదారులు తమ ఆహారపుటలవాట్లు, తీసుకుంటున్న సప్లిమెంట్లను నమోదు చేస్తుంటారు. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు బ్రిటన్‌లోని 3.72 లక్షల మంది వినియోగదారుల సమాచారాన్ని విశ్లేషించారు. వీరిలో 1.75 లక్షల మంది క్రమం తప్పకుండా ఆహార సప్లిమెంట్లు తీసుకున్నట్లు గుర్తించారు. ప్రొబయాటిక్స్, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, మల్టీ విటమిన్లు, విటమిన్‌ డి వల్ల కొవిడ్‌ ముప్పు వరుసగా 14, 12, 13, 9 శాతం మేర తగ్గుతుందని తేలింది. అనంతరం వయసు, స్త్రీ-పురుష, బరువు వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకొని నిర్దిష్ట రక్షణాత్మక ప్రయోజనాల గురించి విశ్లేషించారు. ప్రొబయాటిక్స్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, మల్టీ విటమిన్లు, విటమిన్‌ డి వల్ల  మహిళలకే రక్షణ లభిస్తున్నట్లు ఇందులో వెల్లడైంది. పురుషుల్లో ఈ రక్షణ చత్రం స్పష్టంగా కనిపించలేదు. విటమిన్‌ డి సహా అనేక రకాల సూక్ష్మపోషకాలు రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేయడానికి అవసరమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది.. వ్యాధి నివారణ, కోలుకోవడంలో ప్రభావం చూపుతుందని వివరించారు. అయితే విటమిన్‌ సి, జింక్, వెల్లుల్లితో చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రయోజనమేమీ ఉండటంలేదని తేలినట్లు చెప్పారు.  

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని