close

తాజా వార్తలు

Published : 14/07/2020 09:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గాయంతో 3 గంటల పాటు రైల్వేట్రాక్‌ పక్కన

కరోనా భయంతో దగ్గరకు రాని జనం

హైదరాబాద్‌: కరోనా కాలంలో మానవత్వానికి మచ్చలాంటి సంఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. ప్రమాదవశాత్తూ గాయపడిన ఓ వ్యక్తి చర్లపల్లి రైల్వేట్రాక్‌ పక్కన మూడు గంటలపాటు పడి ఉన్న ఈ ఘటన అలాంటిదే. పశ్చిమబెంగాల్‌కు చెందిన దిలీప్‌ తివారి(50) హైదరాబాద్‌లోని చర్లపల్లిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. మద్యం తాగి సోమవారం ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో రైల్వే ట్రాక్‌ దాటుతూ ప్రమాదవశాత్తూ కిందపడి అపస్మారక స్థితిలోకి చేరాడు. ఈ విషయాన్ని అటుగా వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ గార్డులు.. ఆర్పీఎఫ్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చర్లపల్లి రైల్వేస్టేషన్‌ ఆర్పీఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మురళి వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో కనిపించాడు. కరోనా భయంతో సాయానికి స్థానిక భరత్‌నగర్‌ వాసులు ముందుకు రాకపోవడంతో, ఆయన అంబులెన్స్‌ను రప్పించి.. ఉదయం 7 గంటల సమయంలో తివారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో బాధితుడికి ప్రాణాపాయం తప్పింది.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని