AP News: థియేటర్లలో 100% సీటింగ్‌

తాజా వార్తలు

Updated : 14/10/2021 07:29 IST

AP News: థియేటర్లలో 100% సీటింగ్‌

అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకే కర్ఫ్యూ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు వేళలు తగ్గాయి. ఈ నెల 31వ తేదీ వరకు అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వివాహాలు, ఇతర కార్యక్రమాలకు 250 మందికి మించి హాజరుకాకూడదని  స్పష్టం చేసింది. అలాగే...ఫిక్స్‌ చేసిన సీట్లలో ఒక దానిని వదిలి మరోక దానిలో కూర్చోవాలన్న షరతును తొలగించింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం సినిమా థియేటర్లలో సగం సీట్ల భర్తీ జరుగుతోంది. తాజా ఉత్తర్వుల్లో ఈ నిబంధన తొలగించినందున పూర్తి స్థాయిలో సీట్ల భర్తీకి అవకాశం ఇచ్చినట్లయింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని