కారు దాడి ఘటన కలచివేసింది: బైడెన్‌
close

తాజా వార్తలు

Updated : 03/04/2021 10:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కారు దాడి ఘటన కలచివేసింది: బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికాలోని క్యాపిటల్‌ భవనం వద్ద కారు దాడి ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ఈ దాడిలో మరణించిన పోలీస్‌ అధికారికి ఆయన నివాళి అర్పించారు. ఈ మేరకు బైడెన్‌ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘యూఎస్ క్యాపిటల్‌ సెక్యూరిటీ తనిఖీ కేంద్రం వద్ద కారు దూసుకొచ్చిన ఘటనపై నేను, నా సతీమణి జిల్‌ తీవ్ర ఆవేదనకు లోనయ్యాం. ఈ ఘటనలో పోలీస్‌ అధికారి విలియమ్‌ మృతి చెందడం బాధాకరం. విలియమ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని బైడెన్‌ తెలిపారు.

‘క్యాపిటల్‌ భవనం వద్ద కారు దాడి ఘటనలో తక్షణం ప్రతిస్పందించిన భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సవాలు లాంటి ఇలాంటి సమయంలో క్యాపిటల్‌ను రక్షిస్తున్న వారిని చూసి ఎంతో గర్విస్తున్నా. ఈ దాడిలో అమరుడైన యూఎస్‌ క్యాపిటల్‌ పోలీసు అధికారి విలియమ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా’ అని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ వెల్లడించారు.

అమెరికాలోని క్యాపిటల్‌ భవనం వద్ద శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి  భద్రతా సిబ్బందిపైకి కారుతో దూసుకువచ్చిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసు అధికారి ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. భద్రతా దళాలు వెంటనే నిందితుడిని కాల్చిచంపాయి. అనంతరం అతడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఇది ఉగ్రదాడా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో క్యాపిటల్‌ వద్ద భారీగా భద్రత  మోహరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని