అందరి సహకారంతో ఎన్నికలు:ఏపీ ఎస్‌ఈసీ
close

తాజా వార్తలు

Published : 11/01/2021 01:24 IST

అందరి సహకారంతో ఎన్నికలు:ఏపీ ఎస్‌ఈసీ

అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకెళ్తోంది. ఓ పక్క ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, ఎన్నికల సంఘం తన ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. మరోవైపు ఎన్నికల విధుల్లో తాము పాల్గొనలేమంటూ ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్పందించారు. అందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిద్దామని పిలుపు నిచ్చారు. ఈ మేరకు 2 పేజీల ప్రకటనను విడుదల చేశారు.

పోలింగ్‌ సిబ్బంది భద్రతకు పూర్తి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్‌ సిబ్బంది కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చింది. కరోనా టీకాలో పోలింగ్‌ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ తెలిపారు. పోలింగ్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్‌షీల్డ్‌లు సరఫరా చేస్తామన్నారు. అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. ఏపీ ఉద్యోగులకు ఎవరూ సాటిలేరని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎంతో కష్టపడి పని చేసిన గుర్తింపు ఏపీ ఉద్యోగులకు ఉందని, ఇప్పుడు కూడా అదే  సంకల్పంతో పని చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముందని, దీనికి అందరూ కలిసి రావాలని కోరారు.

ఎన్నికల విషయంలో పార్టీలు ఎస్‌ఈసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని, గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే పార్టీలు కోరుతున్నాయని నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతాయన్నారు. ‘‘ గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా సమాజిక నాయకత్వం ఏర్పడుతుంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తేనే ఆర్థిక సంఘం నిధులు వస్తాయని ఆయన గుర్తు చేశారు.

ఇదీ చదవండి.. వేడెక్కిన పంచాయితీ!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని