చంద్రబాబుకు బాధ్యత అప్పగించండి: పట్టాభి
close

తాజా వార్తలు

Updated : 06/05/2021 17:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చంద్రబాబుకు బాధ్యత అప్పగించండి: పట్టాభి

వారం రోజులు జగన్‌ సీఎం పదవి నుంచి తప్పుకోవాలి
ప్రజల్ని ఏవిధంగా కాపాడాలో ప్రతిపక్షనేత చేసి చూపిస్తారని వ్యాఖ్య

అమరావతి: సీఎం పదవి నుంచి జగన్‌ వారం రోజులు తప్పుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు బాధ్యత అప్పగిస్తే కరోనా నుంచి రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కించాలో చేసి చూపిస్తారని తెదేపా నేత పట్టాభి ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. చంద్రబాబు అధికారంలో ఉంటే పరిస్థితులు మరింత దిగజారేవంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. వారంపాటు అధికారం అప్పగిస్తే చంద్రబాబు సెట్‌రైట్‌ చేస్తారన్నారు. 

హుద్‌హుద్‌ తుపాను, ఉత్తరాఖండ్‌ వరదల సమయంలో చంద్రబాబు ఏవిధంగా సేవలందించారో ప్రజలు చూశారన్నారు. విపత్తు వచ్చినపుడు సమర్థంగా ఎలా ఎదుర్కోవాలి.. ప్రజల్ని ఏవిధంగా కాపాడాలో ఆయన చేసి చూపిస్తారన్నారు. దమ్ముంటే వారం రోజులు జగన్‌ తప్పుకోవాలని పట్టాభి వ్యాఖ్యానించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని