రథయాత్రలో అపశ్రుతి.. ఇద్దరి దుర్మరణం  
close

తాజా వార్తలు

Published : 20/02/2021 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రథయాత్రలో అపశ్రుతి.. ఇద్దరి దుర్మరణం  

10మందికి గాయాలు

దామరగిద్ద: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపన్‌పల్లి శివారులోని వెంకటేశ్వర దేవాలయ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథసప్తమి సందర్భంగా రథయాత్ర నిర్వహించారు. ఆలయానికి కొద్ది దూరంలో స్వామివారి రథాన్ని లాగుతుండగా పైనున్న విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందారు. తొలుత వీరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో మరో పది మందికి గాయాలయ్యాయి. మృతులను దుద్దిమూతల హన్మంతు(40), చంద్రప్ప(42)గా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని