close

తాజా వార్తలు

Published : 27/08/2020 00:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కళ్ల కింద వలయాలు తగ్గాలంటే?

నా వయసు పద్దెనిమిది. నాకు కంటి కింద నల్లటి వలయాలు ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- ఓ సోదరి

కొందరిలో కళ్ల కింద నల్లటి వలయాలు ఎక్కువగా, మరికొందరిలో తక్కువగా ఉంటాయి. తక్కువ నిద్రపోవడం వల్ల ఇవి వస్తాయనుకోవడం నిజం కాదు. ఇవి వంశపారంపర్యంగానూ రావొచ్ఛు ఈ సమస్య ఉండి సరిగా నిద్రపోని వారిలో వీటి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

కారణాలు: ఎండలో ఎక్కువగా తిరగడం, నిద్రలేమి, సైనసైటిస్‌, ఎటోపిక్‌, కాంటాక్ట్‌ డెర్మటైటిస్‌, కొన్ని రకాల అలర్జీలు, రక్తహీనత.. లాంటివి ఈ సమస్య రావడానికి కారణాలు. కొందరు ఏళ్ల తరబడి కళ్లకు కాటుక పెట్టుకునే వారిలో ఇది చర్మంలోకి ఇంకిపోయి నల్లగా మారే అవకాశం ఉంది. వయసుతోపాటు ముడతలు ఎక్కువై నల్లటి వలయాలు పెరుగుతాయి. హైపోథైరాయిడ్‌ సమస్య ఉన్నవారిలో చర్మం పొడిబారి ఉంటుంది. వీరు పదేపదే చర్మాన్ని రుద్దడం వల్ల కూడా నల్లటి వలయాలు రావొచ్ఛు

ఇంటి వైద్యం: చల్లటి కీరా ముక్కలను కళ్ల చుట్టూ అయిదు నిమిషాలపాటు మృదువుగా రాయాలి. బంగాళాదుంప రసాన్ని కళ్ల కింద రాసి పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. అలాగే చెంచా చొప్పున టొమాటో, నిమ్మరసం, కొన్ని చుక్కల బాదం నూనెను తీసుకుని ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు రాయాలి.

చికిత్స: మొదట మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఆ తర్వాత దానిమీద విటమిన్‌-సి లేదా కె ఉండే క్రీమును రెండు పూటలా రాయాలి. అలాగే సన్‌స్క్రీన్‌ లోషన్‌, లైకోరైస్‌ క్రీమ్‌ అప్లై చేయడంవల్ల అక్కడి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కెఫిన్‌ ఉండే విటమిన్‌-సి క్రీమ్‌ రాసుకోవడం వల్ల ఈ నల్లటి వలయాలు తగ్గే అవకాశం ఉంది. రోజూ చిన్న డార్క్‌చాక్లెట్‌ ముక్క, ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉండే వాల్‌నట్స్‌ తీసుకోవాలి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని