Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179142
            [news_title_telugu_html] => 

మోదీకి యూఏఈ అత్యున్నత పురస్కారం

[news_title_telugu] => మోదీకి యూఏఈ అత్యున్నత పురస్కారం [news_title_english] => [news_short_description] => యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ జాయేద్‌’ను శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ ప్రభుత్వం ప్రదానం చేసింది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/oPZut1_XrHU [news_videoinfo] => |https://www.youtube.com/embed/oPZut1_XrHU [news_sections] => ,27,26, ) )
మోదీకి యూఏఈ అత్యున్నత పురస్కారం - EENADU
close
మోదీకి యూఏఈ అత్యున్నత పురస్కారం

‘ఆర్డర్‌ ఆఫ్‌ జాయేద్‌’ ప్రదానం

అబుదాబి/మనామా: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ జాయేద్‌’ను శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ ప్రభుత్వం ప్రదానం చేసింది. పట్టాభిషిక్తుడుకానున్న అబు దాబి యువరాజు మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యన్‌ దీనిని అందజేశారు. రెండు దేశాల మధ్య సంబంధాల పెంపుదలకు కృషి చేసినందుకు గుర్తుగా ఈ పురస్కారాన్ని ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మోదీకి స్వాగతం పలికిన యువరాజు ఆయనను ‘నా సోదరుడు’ అని సంబోధించారు. యూఏఈ మోదీకి రెండో నివాసంలాంటిదని అభివర్ణించారు. ఇరువురు నేతలు వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ రూపే కార్డును ప్రారంభించారు. ఆదివారం బహ్రెయిన్‌లోని శ్రీకృష్ణ మందిరంలో ప్రసాదంగా సమర్పించడానికి ఓ ప్రత్యేక వస్తువును ఆయన కోనుగోలు చేశారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ముద్రించిన తపాలా బిళ్లను యువరాజుతో కలిసి ఆవిష్కరించారు.

కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టండి: ప్రవాస భారతీయుల సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ రాజకీయ సుస్థిరత కారణంగా భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. ఇంతవరకు నిర్లక్ష్యానికి గురయిన జమ్మూ-కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని కోరారు. ఓ పత్రికకు మోదీ ఇంటర్వ్యూ ఇస్తూ 370 అధికరణం కారణంగా కశ్మీరీ యువతను ఒంటరితనం ఆవహించిందని చెప్పారు. దాంతో స్వార్థపర శక్తులు వారిని తప్పుదోవపట్టించి తీవ్రవాదంవైపు వెళ్లేలా చేశారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికే పూర్తి ప్రజాస్వామ్య, పారదర్శక, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఆ అధికరణాన్ని రద్దు చేశాయని వివరించారు. చాలా మంది భారతీయులు యూఏఈని తమ రెండో నివాసంగా భావిస్తున్నారని తెలిపారు. ఇక్కడి ప్రభుత్వం బహుళత్వాన్ని గౌరవిస్తూ, సహనశీలతతో వ్యవహరించడమే ఇందుకు కారణమని అన్నారు. ఇక్కడ ‘సహనం’ అనే శాఖకు ప్రత్యేకంగా మంత్రి ఉన్నారని తెలిపారు. అబుదాబిలో పర్యటన ముగించుకున్న అనంతరం మోదీ బహ్రెయిన్‌ రాజధాని మనామా చేరుకున్నారు. ప్రధాని, యువరాజు అయిన ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా స్వయంగా విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలికారు. అంతరిక్ష, సౌర విద్యుత్తు రంగాల్లో సహకరించుకోవాలని ఇరు నేతలు నిర్ణయించారు. అనంతరం మోదీ మనామాలోని బహ్రెయిన్‌ జాతీయ స్టేడియంలో వేలమంది భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. త్వరలోనే ఇక్కడ రూపే కార్డును ప్రవేశపెడతామన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.