
వాగులో మునిగి ముగ్గురు యువకుల మృతి
సిద్దిపేట జిల్లాలో విషాదం
ప్రాణం తీసిన ఇసుక కందకాలు
కోహెడ, కోహెడ రూరల్- న్యూస్‌టుడే: కార్తీక పున్నమి రోజు ఆ యువకుల కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ప్రవహిస్తున్న జలంలోస్నానం చేస్తే పుణ్యం వస్తుందనే భావనతో వెళ్లిన ముగ్గురు యువకులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఇసుక కోసం వాగులో తీసిన కందకాలే వారిని బలిగొన్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరుకోలులో మంగళవారం ఈ విషాద ఘటన జరిగింది.
వరుకోలుకు చెందిన పెందోట వరప్రసాద్(20), కంటె నిఖిల్(18), కూన ప్రశాంత్(18) మరో ముగ్గురు స్నేహితులతో కలిసి గ్రామంలోని మోయతుమ్మెద వాగులో స్నానానికి వెళ్లారు. వాగులోకి దిగి లోతు తక్కువగా ఉన్న ప్రాంతం నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్లి మునకలు వేద్దామనుకున్నారు. కొంచెం దూరం వెళ్లాక ఒక్కసారిగా లోతు ఎక్కువగా ఉండటంతో ముందు వెళ్తున్న నలుగురు నీట మునిగారు. వెనకాల వస్తున్న ఇద్దరిలో ఒకరైన పవన్‌కల్యాణ్‌కు ఈత వచ్చు. ఆయన మరో మిత్రుడు రామకృష్ణారెడ్డి సాయంతో మునిగిపోతున్న శ్యామకూర అజయ్‌ని కాపాడి బయటకు తెచ్చారు. మిగతా ముగ్గురు కనిపించకుండా పోయారు. ప్రాణాలు దక్కించుకున్న వారు ఊళ్లోకి వెళ్లి కుటుంబసభ్యులు, గ్రామస్థులకు చెప్పారు. ఆ సమయంలో అక్కడికి స్నానానికి వచ్చిన బెజ్జంకి మండలం తోటపల్లి యువకులు నీటిలో దిగి గల్లంతైన వారి కోసం గాలించి మృతదేహాలను బయటకు తీశారు.
వీరిలో వరప్రసాద్ బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతుండగా, నిఖిల్ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ప్రశాంత్ పదో తరగతి వరకు చదివి.. తల్లిదండ్రులకు వ్యవసాయంలో సాయం చేస్తున్నాడు. అతనికి దివ్యాంగురాలైన సోదరి ఉంది. ఒకే రోజు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతిచెందడంతో అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇసుక తీయకపోయి ఉంటే యువకుల ప్రాణాలు పోయి ఉండేవి కావని నిరసిస్తూ పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ను గ్రామస్థులు అడ్డుకున్నారు. అధికారుల నిర్లక్ష్యమేనని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
కిరోసిన్ పోసి మహిళకు నిప్పు |
విద్యార్థిని అపహరణ హత్యాయత్నం వికారాబాద్, న్యూస్‌టుడే: ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఏడో తరగతి విద్యార్థినిపై పాఠశాల కంప్యూటర్ బోధకుడు వల వేశాడు. కారులో వేరే జిల్లాకు తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ప్రతిఘటన ఎదురవడంతో హత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన శ్రీశైలం ఆందోలు మండలం నేరేడుగుంట జడ్పీ పాఠశాలలో ఒప్పంద కంప్యూటర్ బోధకుడిగా పనిచేస్తున్నాడు. అక్కడ ఏడో తరగతి విద్యార్థిని(13)ని ప్రేమ పేరిట ప్రలోభపెట్టాడు. పారిపోయి పెళ్లి చేసుకుందామని నమ్మించాడు. సోమవారం భోజన విరామ సమయంలో పాఠశాల నుంచి కారులో వికారాబాద్ తీసుకొచ్చాడు. బాలికను లొంగదీసుకునే ప్రయత్నం చేయగా, ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో పురుగులమందు కొని బలవంతంగా బాలికకు తాగించాడు. ఆమె స్పృహ తప్పడంతో ఏం చేయాలో పాలుపోక అతనూ పురుగులమందు తాగాడు. ఆ తర్వాత కారు నడుపుకొంటూ వికారాబాద్‌లోని మిషనరీ ఆసుపత్రికి చేరాడు. తమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో పురుగులమందు తాగామని అక్కడి వైద్యుడికి చెప్పాడు. వెంటనే చికిత్స నిర్వహించడంతో ఇద్దరికీ ప్రాణాపాయం తప్పింది. పాఠశాలకు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారుపడిన తండ్రి ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన ప్రధానోపాధ్యాయుడు శ్రీశైలం సెల్‌ఫోన్‌కు ఫోన్ చేయగా విషయం బయటపడింది. జోగిపేట పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. |
కొడుతున్నాడని... కొడుకునే కడతేర్చారు దామెర, న్యూస్‌టుడే: రోజూ తాగి వచ్చి కొడుతున్నాడని.. తమ కుమారుడిని తల్లిదండ్రులే కడతేర్చిన సంఘటన ఇది. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కడారి ప్రభాకర్, విమల దంపతుల కుమారుడు కడారి మహేశ్ చంద్ర(42) ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. భార్యతో నిత్యం గొడవ పడుతుండటంతో రెండు నెలల కిందటే ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. వీరికి ఇద్దరు సంతానం. మద్యానికి బానిసైన మహేశ్ రోజూ తాగి వచ్చి తల్లిదండ్రులను కొట్టేవాడు. మంగళవారం రాత్రి కూడా అలాగే అతడు తాగి వచ్చి తమను హింసిస్తుంటే ఆ తల్లితండ్రులు తట్టుకోలేకపోయారు. మహేశ్‌ని కట్టేసి అతడిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. స్థానికులు వచ్చి చూసేసరికి అతడు శరీరం తీవ్రంగా కాలిపోయి విగతజీవిగా మారాడు. విషయం తెలుసుకున్న పరకాల ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్సై భాస్కర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. |
ముఖ్యాంశాలు
దేవతార్చన

- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య