Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143423
            [news_title_telugu_html] => 

స్మిత్‌.. ఇలా కూడా ఆడతావా?

[news_title_telugu] => స్మిత్‌.. ఇలా కూడా ఆడతావా? [news_title_english] => Steve smith Funny Batting goes viral on social media [news_short_description] => ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ తన బ్యాటింగ్‌తో మరోసారి అభిమానులను అలరించాడు. అయితే ఈసారి పరుగుల పరంగా కాకుండా... [news_tags_keywords] => Test Cricket ,ENGvsAUS ,Steve Smith,Australia,Ashes Series [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 1162464530468868096 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 13:15:57 [news_isactive] => 1 [news_status] => 2 ) )
స్మిత్‌.. ఇలా కూడా ఆడతావా? - Steve smith Funny Batting goes viral on social media - EENADU
close

తాజా వార్తలు

స్మిత్‌.. ఇలా కూడా ఆడతావా?

నవ్వులు పూయిస్తున్న ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ వీడియో

లండన్‌: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ తన బ్యాటింగ్‌తో మరోసారి అభిమానులను అలరించాడు. అయితే ఈసారి పరుగుల పరంగా కాకుండా ఫన్నీ బ్యాటింగ్‌ శైలితో నవ్వులు పూయించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో యాషెస్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ బౌలర్లు విసిరిన చెత్త బంతులను ఆడే క్రమంలో స్మిత్‌ వాటిని చిత్రవిచిత్రంగా వదిలేసి అభిమానులకు భలే వినోదం పంచాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను అభిమానులు ట్విటర్‌లో పోస్టు చేస్తూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. బుధవారం ప్రారంభమైన రెండో టెస్టు మూడో రోజు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా ఈ విచిత్ర బ్యాటింగ్‌ చోటుచేసుకుంది.

వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా రద్దైన మ్యాచ్‌లో గురువారం ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 258 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన ఆసీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. శుక్రవారం మూడో రోజు కూడా వర్షం కురవడంతో కేవలం 24.1 ఓవర్ల పాటు మాత్రమే ఆట కొనసాగింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. మూడో రోజు ఆట నిలిచిపోయేసరికి కంగారుల జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది.

డేవిడ్‌వార్నర్‌(3) గురువారమే నిరాశపర్చగా, శుక్రవారం బాన్‌క్రాఫ్ట్‌(13), ఉస్మాన్‌ ఖవాజా(36) కాస్త నిలకడగా ఆడినట్టు కనిపించినా జట్టు స్కోర్‌ 60 పరుగుల వద్ద వెనువంటనే ఔటయ్యారు. ఆపై మరో 11 పరుగుల స్వల్ప తేడాలో ట్రావిస్‌ హెడ్‌(7) కూడా పెవిలియన్‌ చేరాడు. స్టీవ్‌స్మిత్‌(13; 40 బంతుల్లో 2x4), మాథ్యూస్‌ వేడ్‌(0; 23 బంతుల్లో) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. మరో వికెట్ పడకుండా చెత్త బంతులను వదిలేసే క్రమంలో స్టీవ్‌స్మిత్‌ ఆడిన బ్యాటింగ్‌ తీరు విశేషంగా ఆకట్టుకుంటోంది.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.