మోగింది సాగర భేరి

ప్రధానాంశాలు

మోగింది సాగర భేరి

ఏప్రిల్‌ 17న ఉప ఎన్నిక
తిరుపతి సహా రెండు లోక్‌సభ, 14 శాసనసభ స్థానాలకూ..

ఈనాడు, దిల్లీ: నాగార్జునసాగర్‌ శాసనసభా నియోజకవర్గంలో ఉప ఎన్నికకు నగారా మోగింది. ఏప్రిల్‌ 17న ఇక్కడ ఎన్నికలు నిర్వహించనున్నారు.ఈ మేరకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటన విడుదల చేసింది. 2018 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందిన నోముల నర్సింహయ్య అనారోగ్యంతో గతేడాది డిసెంబరు 1న మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అవసరమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కర్ణాటకలోని బెళగావి లోక్‌సభా నియోజకవర్గాలకు, దేశవ్యాప్తంగా మరో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలకు ప్రకటన విడుదలైంది. 2019 ఎన్నికల్లో తిరుపతి (ఎస్సీ) లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైన బల్లి దుర్గాప్రసాదరావు కరోనాతో గతేడాది సెప్టెంబరు 16న మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్న సురేష్‌ చెన్నబసప్ప అంగడి కరోనాతో మృతిచెందడంతో కర్ణాటకలోని బెళగావి లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. మొత్తం 14 శాసనసభ స్థానాలూ ఖాళీగా ఉన్నాయి. నాగార్జునసాగర్‌ (తెలంగాణ)తో పాటు మోర్వా హదాఫ్‌-ఎస్టీ (గుజరాత్‌), మధుపుర్‌ (ఝార్ఖండ్‌), బసవకళ్యాణ్‌, మస్కి-ఎస్టీ (కర్ణాటక), దామొహ్‌ (మధ్యప్రదేశ్‌), పందర్‌పూర్‌ (మహారాష్ట్ర), సెర్ఛిప్‌-ఎస్టీ (మిజోరాం), నొక్‌సెన్‌ (నాగాలాండ్‌), పిపిలి (ఒడిశా), సహారా, సుజన్‌గఢ్‌-ఎస్సీ, రాజ్‌సమంద్‌ (రాజస్థాన్‌), సల్ట్‌ (ఉత్తరాఖండ్‌)లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది జనవరి 1న ప్రచురితమైన ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తారు. ఉప ఎన్నికలు జరిగే జిల్లాల్లో వెంటనే ఎన్నికల నియమావళి అమలు లోకి వస్తుంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని