రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపండి
close

ప్రధానాంశాలు

రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపండి

ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) సమర్పించి, ఆమోదం పొందే వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవద్దని కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఆదేశించింది. అంతవరకు పనులు ఆపాలని బోర్డు తరఫున సభ్యుడు హెచ్‌కే మీనా ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల కార్యదర్శికి బుధవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశంలో రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టవద్దని చెప్పిన విషయాన్ని లేఖలో గుర్తుచేశారు. కృష్ణా బోర్డు నిపుణుల కమిటీ పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు జరుగుతున్నాయో? లేదా? నివేదించాలని ట్రైబ్యునల్‌ పేర్కొందని వివరించారు. నిపుణుల కమిటీ పర్యటనకు ఆంధ్రప్రదేశ్‌ అవకాశం కల్పించడం లేదని, తాజాగా ఈ ప్రాజెక్టు పనులపై తెలంగాణ కూడా ఫిర్యాదు చేసిందని పేర్కొన్న ఆయన..డీపీఆర్‌ను సమర్పించి, ఆమోదం పొందే వరకు ముందుకెళ్లవద్దని తెలిపారు.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని