close

తాజా వార్తలు

‘కేకో’ కేక ...గిన్నిస్‌ రికార్డ్‌

త్రిసూర్‌: వందల మంది బేకర్లు , షెఫ్‌లు ఒక్కటయ్యారు... ఇంకేముంది... ప్రపంచ రికార్డు సాకారమయ్యింది. కేరళ తీరప్రాంత పట్టణం త్రిసూర్‌లోని నలభీములు ప్రపంచంలోనే అతి పొడవైన కేకును తయారుచేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ కెక్కారు. 6.5 కిలోమీటర్లు పొడవు, 10 సెంటీమీటర్ల మందం ఉన్న ఈ కేక్‌ 27,000 కిలోల బరువుంది. దీని తయారీకి 12,000 కిలోల పంచదార, మైదాలను వాడారు. ఈ వెనీలా కేక్‌ను మరింత రుచికరంగా చేయటానికి దానిని చాకోలేట్‌ పూతతో అలంకరించారు. బేకర్స్‌ అసోసియేషన్‌ కేరళ (బేక్‌) సృష్టించిన ఈ రికార్డును చూడటానికి అక్కడి ప్రజలు గుమిగూడారు. 

6500 మీటర్ల పొడువున్న ఈ కేక్‌ను గిన్నిస్‌ ప్రతినిధులు పరిశీలించి సర్టిఫికెట్‌ ఇచ్చారు. అయితే కచ్చితంగా దీని కొలతలను నమోదు చేసిన అనంతరం ప్రపంచ రికార్డును ప్రదానం చేస్తారని బేక్‌ ప్రతినిధులు వెల్లడించారు. ఈ అతి పొడవైన కేకుకు సంబంధించిన వీడియోను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ కూడా తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. కాగా, ఈ విభాగంలో ప్రస్తుత రికార్డు 2018లో చైనాదేశంలో తయారైన 3.2 కిలోమీటర్ల ఫ్రూట్‌కేకు పేరు మీద ఉంది. తమ కేకు తయారీలో రుచితోపాటు ప్రమాణాల మేరకు శుచి, శుభ్రతలను పాటించామని బేక్‌ సెక్రటరీ జనరల్‌ నౌషాద్‌ వివరించారు. ఈ అతి పొడవైన కేకు ప్రపంచానికి తమ నైపుణ్యాన్ని పరిచయం చేస్తుందని నౌషాద్‌ వ్యాఖ్యానించారు.




Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.