Raj Kundra: నీలిచిత్రాలతో అడ్డంగా సంపాదించిన రాజ్‌కుంద్రా

తాజా వార్తలు

Updated : 16/09/2021 17:23 IST

Raj Kundra: నీలిచిత్రాలతో అడ్డంగా సంపాదించిన రాజ్‌కుంద్రా

ముంబయి పోలీసుల ఛార్జిషీట్‌

ముంబయి: సినిమా అవకాశాల కోసం ముంబయికి వచ్చే యువతులను వంచించి నీలిచిత్రాలు తీయడం ద్వారా ప్రధాన నిందితుడైన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా (46) పెద్దఎత్తున ఆర్జించినట్లు ముంబయి పోలీసులు బుధవారం కోర్టులో దాఖలు చేసిన 1,500 పేజీల అనుబంధ ఛార్జిషీటులో పేర్కొన్నారు. బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త అయిన రాజ్‌కుంద్రా, అతని సహచరుడైన రేయాన్‌ థోర్పేలకు వ్యతిరేకంగా ఈ ఛార్జిషీటును క్రైం బ్రాంచ్‌ పోలీసులు మేజిస్ట్రేట్‌ కోర్టులో సమర్పించారు. నీలిచిత్రాలను కొన్ని యాప్‌ల ద్వారా నిందితులు మార్కెటింగ్‌ చేసుకునేవారని అందులో తెలిపారు. ఈ కేసులో సింగపూర్‌కు చెందిన యశ్‌ ఠాకుర్, లండన్‌కు చెందిన ప్రదీప్‌ బక్షి కూడా నిందితులుగా ఉన్నారు. వీరిని అరెస్టు చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. రాజ్‌కుంద్రా, థోర్పే గత జులై నెల 19 నుంచి జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. వీరి బెయిల్‌ పిటిషన్‌ ముంబయి సెషన్స్‌ కోర్టులో పెండింగులో ఉంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని