కొవిడ్ కాలంలోనూ 1.75లక్షల ఇళ్లు నిర్మించగలిగాం!

తాజా వార్తలు

Published : 12/09/2020 13:30 IST

కొవిడ్ కాలంలోనూ 1.75లక్షల ఇళ్లు నిర్మించగలిగాం!

ప్రధాని నరేంద్ర మోదీ

భోపాల్‌: దేశాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్నప్పటికీ.. పేదవారి కోసం 1.75 లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేవలం 45-60 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతాయన్నారు. పేద ప్రజల్ని సాధికారుల్ని చేయడం ద్వారానే దేశంలో పేదరికం తొలగిపోతుందన్నారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) ప్రారంభమైందన్నారు. ఈ పథకం కింద నిర్మించిన 1.75 లక్షల ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో మోదీ వర్చువల్‌ సమావేశం ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులతో మోదీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌహాన్‌ మాట్లాడుతూ.. ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేసేందుకు మోదీ కృషి చేస్తున్నారన్నారు. 20లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకోగా మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే 17 లక్షల ఇళ్లు పూర్తయ్యాయన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని