ఈ టన్నెల్ ద్వారా వెళ్తే వైరస్‌కు మూడిందే
close

తాజా వార్తలు

Published : 02/04/2020 19:41 IST

ఈ టన్నెల్ ద్వారా వెళ్తే వైరస్‌కు మూడిందే

తిరుప్పూరు(తమిళనాడు): కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు, అధికారులు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. తాజాగా తమిళనాడులోని తిరుప్పూరు పరిధిలో తెన్నంపలయం మార్కెట్‌ బయట కొవిడ్ 19 కట్టడికి తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

తెన్నంపలయం మార్కెట్ బయట డిస్‌ఇన్ఫెక్టెడ్ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. కచ్చితంగా చేతులు శుభ్రం చేసుకొని ఆ టన్నెల్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. దానిలోకి వెళ్లగానే నాజిల్స్ ద్వారా వచ్చిన స్ప్రే అందులో ఉన్న వ్యక్తి  మీద పడటంతో వైరస్‌ నిర్మూలన సాధ్యమవుతుంది. దానికి సంబంధించిన వీడియోను తిరుప్పూరు జిల్లా కలెక్టర్ విజయ కార్తికేయన్‌ ట్విటర్‌లో షేర్ చేశారు. ‘తెన్నంపలయం మార్కెట్ వద్ద మేము ఏర్పాటు చేసిన డిస్‌ఇన్ఫెక్టెడ్ టన్నెల్ దేశంలో మొదటిది. మార్కెట్‌లోకి ప్రవేశించే ముందు మొదట చేతులు శుభ్రం చేసుకొని 3 నుంచి 5 సెకన్ల పాటు ఈ టన్నెల్‌లో వెళ్లాల్సి ఉంటుంది’ అని తన ట్విటర్‌ ఖాతాలో వివరించారు. టన్నెల్‌లో ఉన్న నాజిల్స్‌ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని అక్కడున్న వ్యక్తి మీద చల్లుతాయని, వైరస్‌ నిర్మూలనకు అది పూర్తి స్థాయిలో సరిపోతుందని కలెక్టర్‌ మీడియాకు వెల్లడించారు. ఆ వీడియో షేర్ చేసిన దగ్గరి నుంచి పెద్ద ఎత్తున వీక్షణలు వస్తూనే ఉన్నాయి. సరికొత్త ప్రయోగం, గొప్ప ఆలోచన అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని